మూడో సినిమా హిట్. సూపర్ హిట్. బంపర్ హిట్. హ్యాట్రిక్ హిట్. ఇదండీ వరుస. కుర్ర హీరో నాగశౌర్య ఉన్నాడు చూడండి.. ఏకంగా మనోడు హ్యాట్రిక్ ఆఫ్ హిట్స్ అంటూ తన ''జాదూగాడు'' గురించి టముకు వేస్తున్నాడు. ఈ సందర్భంగా ఇతగాడి నిర్మాతలు ఒక యాడ్ కూడా రిలీజ్ చేశారు. సినిమా అస్సలు బాగాలేదు బాబోయ్ అంటూ క్రిటిక్స్, కలెక్షన్స్ చెబుతుంటే మనోడు మాత్రం ఇలా ప్రచారం చేసుకుంటున్నాడు. పోనివ్ జాదూగాడు బ్లాక్‌బస్టర్ అనుకుందాం. మరి ఈ హ్యాట్రిక్ గోల ఏంటి రాజా??
తొలి సినిమా ''ఊహలు గుసగుసలాడే''. సోలో హీరోగా తొలి సినిమా ఇది. ఓకె, సూపర్ హిట్. ఆ తరువాత ''చందమామ కథలు'' సినిమాలో ఓ స్టోరీ చేశాడు. నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఆ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్. ఇంతలో ''దిక్కులు చూడకు రామయ్య'' అంటూ మరో మూవీతో వచ్చాడు. ఆ సినిమాను క్రిటిక్స్ ప్రేమించారు కాని, జనాలు పెద్దగా చూడలేదు. కొంతమేరకు కలెక్షన్స్ వచ్చినా చివరకు కాస్త లాస్ తప్పలేదు. దాని తరువాత ''లక్ష్మీరావే మా ఇంటికి'' అనే సినిమాతో వచ్చాడు. అట్టర్ ఫ్లాప్. ఆ సినిమా గురించి ఎక్కువగా చెప్పడం కూడా వేస్ట్. సో, ఇలా రిజల్ట్స్ ఉన్నప్పుడు అసలు ఏ యాంగిల్‌లో ''జాదూగాడు'' హ్యాట్రిక్ అవుతుంది? హిట్స్‌లోనా.. ఫ్లాప్స్‌లోనా..?? క్లారిటీ మిస్సింగ్ నానా..