ఛలో కుర్రాడు దర్శకుడయ్యాడు

Update: 2018-05-12 13:43 GMT
ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో తనది కూడా ఒకటి ఖాతాలో వేసుకున్న కుర్ర హీరో నాగ శౌర్య దర్శకుడిగా మారబోతున్నాడు. కాకపోతే సినిమా కోసం కాదు లెండి. షార్ట్ ఫిలిం కోసం. మదర్స్ డే సందర్భంగా తను ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్ ఫిలిం ని రేపు విడుదల చేయనున్నాడు శౌర్య. ఛలో నిర్మించిన ఐరా బ్యానర్ మీదే నిర్మించిన ఈ లఘు చిత్రానికి టెక్నీషియన్స్ ని సినిమాలో లెవెల్ లో సెట్ చేసుకున్నాడు. మహిళలు ఈ సంఘానికి రూపకర్తలంటూ వివిధ రూపాల్లో తమ కర్తవ్యాన్ని నిర్వహించి మనం గర్వపడేలా చేస్తారని మెసేజ్ చేసిన శౌర్య బలమైన స్త్రీ శక్తివంతమైన మాతృమూర్తులు ఒక దేశం సత్తాను చాటుతారని అలాంటి వాళ్ళకు సెల్యూట్ చేయటం కోసమే ‘భూమి’  షార్ట్ ఫిలిం ని తీసినట్టు పేర్కొన్నాడు .

ఛలో హిట్ తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నాగ శౌర్య ప్రస్తుతం నర్తనశాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మొదలు పెట్టిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ గ్యాప్ లోనే శౌర్య ఈ భూమిని ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నాడు. ఐరా సంస్థకు చెందిన స్వంత యు ట్యూబ్ ఛానల్ లో రేపు దీన్ని విడుదల చేయబోతున్నారు. రమణ తేజ రచన చేసిన ఈ లఘు చిత్రానికి అనంత్ శ్రీకర్ సంగీతం అందించగా వినయ్-ప్రఫుల్ జా-సాయి బాబా ఎడిటర్స్ గా పని చేసారు. ఐరాతో పాటు ఇన్ఫినిటం సంస్థ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉంది. భరత్ బండారు, హ్రితి, దిలీప్, సుభాషిని నటించిన ఈ షార్ట్ ఫిలింలో నాగ శౌర్య నటించలేదు. దర్శకత్వ బాధ్యతలు మాత్రమే నిర్వహించారు. మరి మాతృ దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్న ఈ యూత్ హీరో డెబ్యు షార్ట్ మూవీ ఎలా ఉంటుందో రేపు తెలిసిపోనుంది.
Tags:    

Similar News