మెగా హీరోలకి సంబంధించిన ఫంక్షన్ అంటే చాలు. పవర్ స్టార్... పవర్ స్టార్... అంటూ నినాదాలు హోరెత్తిపోయేవి. ఎదురుగా చిరంజీవి మాట్లాడుతున్నా సరే అవేమీ వినిపించుకోకుండా పవన్ కల్యాణ్ జపం చేసేవాళ్లు అభిమానులు. అసలు ఎవర్నీ మాట్లాడనివ్వకుండా ఒక దశలో ఫంక్షన్ లను రసాభాసగా మార్చేసేవారు. పవన్ ఊళ్లో లేడు మొర్రో అన్నా కూడా ఆగిపోయేవాళ్లు కాదు. నిదానంగా శాంతపరిచి పవన్ గురించి కొన్ని మాటలు చెప్పాకగానీ అసలు విషయం మాట్లాడనించేవాళ్లు కాదు. కానీ శుక్రవారం రాత్రి జరిగిన బ్రూస్ లీ ఆడియో వేడుక మాత్రం అందుకు డిఫరెంట్ గా జరిగింది. అందులో ఇదివరకటిలాగా పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు లేవు. ప్రసంగం మధ్యలో అడ్డు పడటాలు లేవు. అంతా మెగాస్టార్ - మెగా పవర్ స్టార్ అన్న జపమే. పవన్ విషయంలో అభిమానుల్ని బాగా కంట్రోల్ చేసినట్టు అనిపించింది. నాగబాబు ఇదివరకటి ఫంక్షన్ లో ఇచ్చిన వార్నింగ్ బాగా పనిచేసిందని, అందుకే ఎలాంటి అంతరాయాలు కలగకుండా మెగా ఫంక్షన్ జరిగిందని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి.
చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానుల కోసం ఇటీవల ఓ వేడుకని పెద్దయెత్తున జరిపిన విషయం తెలిసిందే. అందులో పవర్ స్టార్ నినాదాలు విన్న నాగబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. వాడు పిలిస్తే రాడు, మీరే వెళ్లి పిలవండి, అంతేగానీ ఇక్కడ అరిచి డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఇలా చేస్తే ఇక నుంచి సహించేది లేదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ మాటలు మెగా వేడుకలో బాగా పనిచేసినట్టు చెప్పుకొంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పవన్ కళ్యాణే స్వయంగా జోక్యం చేసుకొని అభిమానులు అలా వ్యవహరించకూడదని గట్టిగా చెప్పి పంపినట్టు కూడా తెలుస్తోంది. ఏదైమనా చాలా రోజుల తర్వాత ఓ మెగా వేడుక పవన్ ఊసు లేకుండా జరిగిపోయింది. అన్నట్టు ఈ వేడుకకి నాగబాబు కానీ, ఆయన తనయుడు వరుణ్ కానీ హాజరు కాకపోవడం గమనార్హం.