మెగా ప్రిన్స్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన లోఫర్ ఆడియో ఫంక్షన్ అందరినీ అలరించింది. బాహుబలి ప్రభాస్ చీఫ్ గెస్ట్, రామ్ గోపాల్ వర్మ సహా అనేకమంది స్టేజ్ తమ మాటలు చెప్పి అలరించారు. కానీ.. ఓ విషయం మాత్రం అందిరినీ ఆశ్చర్యపరిచింది. అదే వరుణ్ తేజ్ తండ్రి నాగేంద్ర బాబు ఫంక్షన్ కి వచ్చినా.. స్టేజ్ మీదకు మాత్రం రాకపోవడం.
లోఫర్ ఆడియో వేడుకకు మెగా హీరోలు ఎవరూ రావద్దని పూరీ కండిషన్ పెట్టాడనే టాక్ ముందునుంచి వినిపించింది. అందుకు తగ్గట్లుగానే ఏ ఒక్క మెగా హీరో కూడా ఇందులో కనిపించలేదు. చివరకు మెగాస్టార్ మాత్రం ఓ సౌండ్ బైట్ ఇచ్చారంతే. ఇలా మెగాహీరోలు కనిపించని మెగా వారసుడు ఫంక్షన్ ఇదే అని చెప్పాలి. అయితే.. ఫంక్షన్ కు వచ్చి. స్టేజ్ కింద ఉన్న నాగేంద్రబాబు, ఒకసారి కూడా స్టేజ్ ఎక్కకపోవడం ఆశ్చర్యకరమే అని చెప్పాలి.
ఓ రకంగా చెప్పాలంటే.. అన్నయ్య చిరంజీవికి అపర భక్తుడు నాగబాబు. తన వాళ్లు ఎవ్వరూ రాలేదు కాబట్టి.. తను కూడా స్టేజ్ ఎక్కలేదు.. వాటే మెగా యూనిటీ అనుకున్నారు చాలామంది. అయితే.. ఓ విషయంలో మాత్రం నాగబాబు స్టేజ్ ఎక్కని లోటు కనిపించింది. ఆడియన్స్ నుంచి పవర్ స్టార్ అని వచ్చే అరుపులను నాగబాబు గత ఫంక్షన్లలో కంట్రోల్ చేశారు. ఈ సారి మాత్రం వీటిని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాలేదు.