మెగా బ్రదర్ కార్‌ అదేనా??

Update: 2016-04-28 17:30 GMT
ఏమైనా డబ్బులు సంపాదించడం వేరు, దాచుకోవడం వేరు, అనుభవించడం వేరు. దీన్ని ఎవరూ కాదనలేరు. సెలబ్రిటీల విషయంలోనే అప్పుడప్పుడూ కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ 'మిస్టర్' లాంఛింగ్ ఈవెంట్ లో ఈ తేడా స్పష్టంగా కనిపించింది.

మెగా బ్రదర్ నాగేంద్ర బాబు తన ఫ్యామిలీతో సహా ఈ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఇందుకోసం ఆయన హోండా సివిక్ వెహికల్ లో వచ్చాడు. దీని మార్కెట్ రేట్ 14 లక్షల రూపాయలకు అటూ ఇటూగా ఉంటుంది. కానీ ఇదే ఫంక్షన్ కి హాజరైన దర్శకుడు శ్రీను వైట్ల మాత్రం రేంజ్ రోవర్ స్పెషల్ ఎడిషన్ కార్ లో వచ్చాడు. దీని రేటు కోటిన్నర పైగానే ఉంటుంది. ఎవరి ఇష్టం వారిది కానీ.. మెగాస్టార్ ఫ్యామిలీ సభ్యుడైన నాగబాబు వాడే కార్ కంటే.. ఓ దర్శకుడు ఉపయోగించే వెహికల్ కాస్ట్ 10రెట్లు ఎక్కువ అంటే ఆశ్చర్యం వేయకమానదు.

శ్రీను వైట్ల ప్రస్తుతం కొంచెం వెనకబడ్డా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. ఒకో సినిమాకి 10 కోట్లు చొప్పున ఛార్జ్ చేస్తున్నాడు. ఏడాదికి ఒక సినిమా మాత్రమే తీస్తున్నా.. గత కొన్నేళ్లుగా ఈ రేటుకి స్టిక్ అయి ఉన్నాడు. మరోవైపు నాగేంద్రబాబు మాత్రం సింపుల్ గా బతికేసే వ్యక్తే. పైగా నిర్మాతగా కొన్ని దెబ్బలు కూడా తిన్నాడు. అయినంత మాత్రాన కాస్ట్లీ కార్ కొనలేడని చెప్పలేం కానీ... ఎవరి లైఫ్ స్టైల్ వాళ్లదే. అయితే.. ఉన్న సొమ్ముతో ఎంజాయ్ చేయడం మాత్రం అందరి వల్లా అయ్యే పని కాదు కదా. అయితే అసలు ఆ హోండా సివిక్‌ ఆయనదేనా అని అడిగేవారూ ఉన్నారూ.
Tags:    

Similar News