#మెగా వెడ్డింగ్‌: నిహారిక‌కు నాగ‌బాబు ఎమోష‌న‌ల్ గిఫ్ట్

Update: 2020-12-07 08:59 GMT
కూతురిని అత్తారింటికి పంపే వేళ త‌ల్లిదండ్రుల ఎమోష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిహారిక‌ను పెళ్లి కూతురిని చేసిన అనంత‌రం అలాంటి ఎమోష‌న్ కే గుర‌య్యారు మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు. త‌న కుమార్తె నిహారిక ఐజీ కుమారుడు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహ‌మాడుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో ఉద‌య్ ప్యాలెస్ లో ఈ నెల 9న వివాహం జ‌ర‌గ‌నుంది.

నేడు నిహారిక‌- చైత‌న్య ఇరు కుటుంబ స‌భ్యులు ప్ర‌త్యేక విమానంలో ఉద‌య్ పూర్ వెళ్లారు. ఇదివ‌ర‌కూ కుటుంబ స‌భ్యుల‌తో కాబోయే వ‌ధూవ‌రుల ఫోటో రివీలైంది. పెళ్లికొడుకు చైత‌న్య దంతులూరి విమాన‌యానానికి సంబంధించిన‌ సెల్ఫీ దిగి దానిని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు.

ఇక నాగ‌బాబు ఇంట ప్రీవెడ్డింగ్ సంబ‌రాలు ముగించి బ‌య‌ల్దేరారు. అయితే విమానం ఎక్క‌క ముందే నాగ‌బాబు చేసిన ఓ ఎమోష‌న‌ల్ ట్వీట్ ఆస‌క్తిని క‌లిగించింది. కుమార్తె నిహారిక‌ను ఉద్ధేశించి ఇందులో ట్వీట్ చేశారు.

``ఒక కుటుంబంగా మేం నీకు మూలాలు(రూట్స్) ఇచ్చాం. ఒక తండ్రిగా నీకు నేను రెక్కలు(వింగ్స్) ఇచ్చాను. ఆ రెక్కలు నిన్ను ఎంతో ఎత్తు(హై)కు ఎగిరే అవకాశాన్నిస్తాయి. ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ భద్రం(సేఫ్‌)గా ఉంచుతాయి. నీ ప్రియమైన తండ్రి నీకిచ్చిన ఉత్తమమైన రెండు బహుమతులు ఇవే’’ అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు నాగ‌బాబు. పెళ్లి కూతురు నిహారిక‌తో క‌లిసి త‌న కుటుంబం అలానే చిరంజీవి- సురేఖ కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

నిహారిక వివాహ మ‌హోత్స‌వ వేడుక‌లు రెండ్రోజుల పాటు ఉద‌య్ పూర్ లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుకల‌కు అటెండ‌య్యే అతిథులంతా ఈరోజే విచ్చే య‌నున్నార‌ట‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథుల్ని రిసీవ్ చేసుకునేందుకు ముందే వెళుతున్నార‌న్న స‌మాచారం ఉంది. అతిథులంద‌రికీ కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌లు వ‌ర్తించ‌నున్నాయి. అన్ని జాగ్ర‌త్త‌ల న‌డుమ ఈ వివాహం జ‌ర‌గ‌నుంది.


https://twitter.com/NagaBabuOffl/status/1335782096539795459
Tags:    

Similar News