మొన్ననే మాహేష్ బాబు ఒక మంచి మాట చెప్పాడు. ఇక నుంచి ఫంక్షన్ల ట్రెండు మారుతుందని. ఒక హీరో మరొక హీరో వేడుకలకు తప్పకుండా వస్తారని చెప్పాడు. అయితే అది కేవలం వేడుకల వరకే కాకుండా సినిమా ఓపెనింగ్ ల నుంచి తెరపైకి కూడా వచ్చేసింది. ముఖ్యంగా పెద్ద స్టార్స్ సినిమలకు మరో పెద్ద స్టార్స్ టచ్ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అన్ని వైపులా నుంచి కవర్ చేస్తోంది. పవన్ ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ కు వెళితే చరణ్ ఏకంగా తారక్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూడా ఎన్టీఆర్ కి టచ్ అవ్వనున్నాడు. త్రివిక్రమ్ - తారక్ సినిమాలో నాగబాబు ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడట. ఆ సినిమా షూటింగ్ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయ్యింది.
అందుకు సంబందించిన ఫొటోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తారక్ అనుకున్నట్టుగానే చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ చాలా రోజుల తరువాత కనిపించాడు. ఇక మొత్తానికి మెగా ఫ్యామిలీ ఓ విధంగా ఎన్టీఆర్ కి దగ్గరవుతోంది. మరి ఇలాంటి రిలేషన్ తోనే మిగతా హీరోలు కూడా కనిపిస్తే బావుంటుంది.