ఈయన టాలీవుడ్‌ ఆజాత శత్రువు

Update: 2015-04-15 19:30 GMT
శత్రువే లేనివాడిని ఆజాతశత్రువు అని పిలుస్తాం. నలుగురికి మంచి చేసేవాడు.. నలుగురి తలలో నాలుకలా ఉండేవాడు.. ఎల్లపుడూ మంచినే కోరేవాడు.. దానగుణం కలవాడు.. శత్రువుతోనూ మిత్రత్వం చేసేవాడూ ఆజాతశత్రువుగా పేరు తెచ్చుకుంటాడు. గొడవ జరుగుతుంటే.. నాకెందుకులే అని వెళ్లిపోకుండా సామరస్యంగా ఆ గొడవ సద్ధుమణిగేందుకు కృషి చేసే మంచి బుద్ధి కూడా ఇలాంటివాళ్లకే సాధ్యం. టాలీవుడ్‌లో అలాంటివారెవరైనా ఉన్నారా? అని టార్చ్‌ వేసి వెతికితే ఒక ప్రముఖుడు తగిలారు.

ఆయనే మెగా బ్రదర్‌ నాగబాబు. చిటెకెలో ఏ సమస్యనయినా పరిష్కరించే తత్వం ఉన్న మనిషిగా పేరు బడ్డారాయన. నటీనటుల మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు వాటిని పరిష్కరించేవాడిగా నాగబాబు ముందుకొస్తుంటారు. అంతేకాదు ఇటీవలే ఓ ఆర్టిస్టుపై పరిశ్రమేతర వ్యక్తులు దాడి చేసినప్పుడు నేను నీకు అండగా ఉన్నా అని భరోసానిచ్చారాయన. అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవిపై ఈగైనా వాలనివ్వని గొప్ప సోదరుడు. పవన్‌ అంటే పిచ్చి ప్రాణం. కొడుకు వరుణ్‌తేజ్‌ని హీరోని చేశారు. కూతురు నిహారిక బుల్లితెర కెరీర్‌లో స్థిరపడడానికి తనవంతు సాయం చేస్తున్నారు. ఇలా అతడిలో సున్నిత ఉద్వేగాలున్న వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్‌ కనిపిస్తాడు. మ్యాన్లీ హీరో కనిపిస్తాడు. ఇవన్నీ పొగడ్తలు కాదు.. పక్కా నిజాలు.

Tags:    

Similar News