దసరా సినిమాల్ని వదిలేశారు

Update: 2016-10-12 22:30 GMT
ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలొచ్చాయి. అందులో మూడు భారీ సినిమాలు. ఒకటి మీడియం రేంజి సినిమా. దాదాపుగా అన్ని సినిమాలకూ పాజిటివ్ టాకే వచ్చింది. నాలుగు సినిమాలకూ ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. దీంతో వాటికి పోటీగా రెండో వారంలో సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడ్డారు. ఆల్రెడీ అన్ని సినిమాలు థియేటర్లలో ఉండగా వేరేవి పోటీకి ఎందుకని తర్వాతి వారం ఖాళీ వదిలేశారు.

ఇప్పుడు దసరా సినిమాల విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. దసరాకు ఏకంగా ఐదు సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే. వీటిలో ‘ప్రేమమ్’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. మిగతావి ఓ మోస్తరు టాక్ తో నడుస్తున్నాయి. వీటిలో ఏదీ తీసి పడేయదగ్గ సినిమా కాదు. ఈ నేపథ్యంలోనే రాబోయే శుక్రవారం కొత్తగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ చేయట్లేదు. నేను సీతాదేవి.. కొత్త కొత్తగా ఉన్నది అంటూ ఏవో పెద్దగా పేరు లేని సినిమాలు వస్తున్నాయి. వాటిని జనాలు పట్టించుకోవడం కష్టమే.

ఇవి కాకుండా రెండు డబ్బింగ్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అందులో ఒకటి.. కోడి రామకృష్ణ రూపొందించిన ‘నాగభరణం’. కన్నడలో తెరకెక్కిన ఈ భారీ గ్రాఫిక్స్ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు కొంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కాకుండా హాలీవుడ్ మూవీ ‘ఇన్ఫెర్నో’ డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజవుతోంది. ఈ చిత్రంలో టామ్ హాంక్స్ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పడం విశేషం. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. ఈ డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుంటాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News