కేసు ఇన్వెస్టిగేట్ చేయ‌బోతున్న నాగచైతన్య..?

Update: 2021-02-03 16:30 GMT
అక్కినేని హీరోల్లో జోరు మీదున్న హీరో నాగ చైతన్య. తండ్రి, తమ్ముడి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడీ హీరో. చైతూ అప్ కమింగ్ మూవీ 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కు దగ్గరలో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ స్పీడుగానే ఉన్నాడీ అక్కినేని కుర్రోడు. 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఆ సినిమాకు ‘థాంక్యు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తోంది.

ఇప్పుడు మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో మరో మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడట చైతూ. ఈ రెండు సినిమాలనూ ఒకేసారి పట్టాలెక్కించాలని, వీలైతే వచ్చే ఏడాది బ్యాక్ టూ బ్యాక్ ఈ రెండు చిత్రాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.

తరుణ్ భాస్కర్ తో చేయబోయే ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే.. దర్శకుడు తరుణ్ భాస్కర్ వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం వెంకీ ఎఫ్-3తో బిజీగా ఉన్నాడు. ఈ  చుట్టేసిన తర్వాత తరుణ్ భాస్కర్ చిత్రం ఉంటుందట. అయితే.. ముందుగా వెంకీ సినిమా మొదలవుతుందా? చైతూ సినిమా మొదలవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News