‘హలో’ యాక్షన్ సీక్వెన్స్.. చాలా కథ ఉంది

Update: 2017-12-17 14:30 GMT
‘హలో’ సినిమా యాక్షన్ ప్రధానంగా సాగుతుందని దీని టీజర్.. ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. వీటితో పాటుగా ఒక యాక్షన్ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. మొత్తంగా చూస్తే హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని యాక్షన్ కంటెంట్ తో ‘హలో’ టీం రాబోతోందని స్పష్టమైంది. ఈ విషయంలో తాము ఎంత శ్రద్ధ తీసుకున్నది హీరో అఖిల్.. నిర్మాత నాగార్జున ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తొలిసారిగా ఇండియన్ సినిమాకు అథెంటిక్ పార్కౌర్ యాక్షన్ ను తాము పరిచయం చేయబోతున్నామని నాగ్-అఖిల్ వెల్లడించారు. భవనాల మీదికి ఏ సపోర్ట్ లేకుండా అలాగే ఎక్కేయడం.. పై నుంచి దూకేయడం.. ఒక బిల్డింగ్ మీది నుంచి మరో బిల్డింగ్ మీదికి జంప్ చేయడం.. దీన్నే పార్కౌర్ యాక్షన్ అంటారు. ‘హలో’ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా ఈ తరహాలోనే సాగుతుందని నాగ్-అఖిల్ చెప్పారు.

‘హలో’ సినిమా కోసం ప్రపంచంలోనే ది బెస్ట్ అనదగ్గ హాలీవుడ్ పార్కౌర్ యాక్షన్ నిపుణుల్ని రప్పించామని.. వాళ్లు మూడు నెలలకు పైగా ఇక్కడే ఉండి ఈ సీక్వెన్స్ పూర్తి చేశారని అఖిల్ తెలిపాడు. ముందు రెండు నెలల పాటు రిహార్సల్సే జరిగాయని.. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు షూటింగ్ చేశామని.. నెల రోజుల పాటు కేవలం యాక్షన్ సన్నివేశాలే చిత్రీకరించామని చెప్పాడు. సినిమాలో ఒక్క కంప్యూటర్ గ్రాఫిక్స్ షాట్ కూడా ఉండకూడదని ముందే షరతు పెట్టుకున్నామని.. ఆ ప్రకారమే అన్ని యాక్షన్ సీక్వెన్సులూ రియలిస్టిగ్గా చేశామని చెప్పాడు. మొత్తంగా ‘హలో’ సినిమాలో ఐదు యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయని.. అవన్నీ హాలీవుడ్ నిపుణులే చేశారని.. దాదాపు అరగంట వ్యవధిలో యాక్షనే ఉంటుందని.. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సీన్స్ ఉంటాయని అఖిల్ వెల్లడించాడు.
Tags:    

Similar News