పాత క్లాసిక్స్ టైటిల్స్ ని కొత్త సినిమాలకు వాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. క్రేజ్ వస్తుంది అనే దాని కన్నా అది తీస్తున్న కంటెంట్ కి ఎంత వరకు సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈ మధ్య అలాంటివి చూసుకోకుండా టైటిల్స్ కొరతనో లేక ఆ పేర్లు పెడితే ప్రేక్షకులు దృష్టిని వెంటనే ఆకర్షించవచ్చనో మొత్తానికి మరోరకంగా చర్చకు దారి తీస్తున్నారు దర్శక నిర్మాతలు. నిన్న విడుదలైన మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ మరోసారి దీనికి అవకాశం ఇచ్చింది. లండన్ లో ఉంటూ ఏ మిస్ ని మిస్ చేయకూడదని తిరిగే ప్లే బాయ్ తరహా క్రేజీ పాత్రలో అఖిల్ లో చూపించబోతున్నట్టు క్లూ ఇచ్చేసారు. దానికి తగ్గే విజువల్స్ కూడా ఉన్నాయి. పేరు మజ్ను అని పెట్టారు. అది పాత్ర పేరా లేక స్వభావానికి తగ్గట్టు అనుకున్నారా విడుదలయ్యాక చెప్పగలం కానీ నిజానికి చరిత్రలో మజ్ను గొప్ప ప్రేమికుడు. ప్రేయసి కోసం ప్రాణాలు విడిచినవాడు. మజ్ను పేరుతో నాగార్జున దాసరి గారితో 87లో ఒక క్లాసిక్ లో నటించాడు. నిజమైన ప్రేమికుడిగా అందులో నాగ్ జీవించిన తీరు ఇది తొలి రాత్రి అనే పాట ప్రేక్షకుల మనసులో అలా ముద్రించుకుపోయాయి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇంత జోవియల్ గా ఉండే పాత్రకు మజ్ను అని పెట్టడం పట్ల కామెంట్స్ రావడంలో ఆశ్చర్యం లేదు.
మరోవైపు నాగార్జున సైతం నాన్న ఎవర్ గ్రీన్ క్లాసిక్ టైటిల్ దేవదాస్ తో వస్తున్నాడు. ఇది ఫక్తు కామెడీ మాస్ ఎంటర్ టైనర్. ప్రేమ లాంటివాటికి అంతగా ప్రాధాన్యత ఉండదు కానీ దేవదాస్ అంటే పార్వతి కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన నాగేశ్వర రావు గారే కనిపిస్తారు. మరి నాగ్ అంత ఈజీగా ఈ టైటిల్ కు ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే నాగ్ తన తండ్రి క్లాసిక్ టైటిల్ ని అఖిల్ తన నాన్న హిట్ మూవీ పేరును వాడుకున్నారు కాబట్టి. ఏ మాత్రం తేడా వచ్చినా చెడగొట్టారే అనే నింద మోయాల్సి ఉంటుంది. ఇదే మజ్ను టైటిల్ ని నాని ఓసారి దేవదాస్ ని రామ్ ఓసారి వాడేసుకున్నారు. వాళ్ళు బయటి హీరోలు కాబట్టి అవి హిట్టయినా ఫట్టయినా ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈ కేస్ అలా కాదు. నాగ్ పేరుని అఖిల్ అక్కినేని పేరుని నాగార్జున మోస్తున్నారు. సో టైటిల్ పెట్టుకోవడంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆ మధ్య తొలిప్రేమ టైటిల్ పెట్టుకున్నప్పుడు వరుణ్ తేజ్ పడిన టెన్షన్ చూసాంగా. అలా పాస్ అయిపోతే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ రివర్స్ అయితేనే చిక్కులు.