బాల‌య్య‌.. నాగ్ లు క‌లిసిపోనున్నారా?

Update: 2017-04-08 06:22 GMT
మిగిలిన వుడ్ ల‌తో పోలిస్తే.. టాలీవుడ్ అగ్ర‌హీరోల మ‌ధ్య సంబంధాలు బాగానే ఉంటాయ‌ని చెప్పాలి. చిన్న‌చిన్న కార‌ణాల మ‌ధ్య తేడాలున్నా.. వాటిని మ‌రింత ర‌చ్చ చేసుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని వైనం క‌నిపిస్తుంటుంది. ఎవ‌రైనా ఒక‌రు తొంద‌ర‌ప‌డినా.. రెండోవారు కాస్త త‌గ్గ‌టం క‌నిపిస్తుంటుంది. ఆ మ‌ధ్య‌న అగ్ర‌హీరోలు.. బాల‌కృష్ణ‌.. నాగార్జున‌ల మ‌ద్య సంబంధాలు దెబ్బ‌తిన‌టం తెలిసిందే. ఇరువురి మ‌ధ్య నెల‌కొన్న గ్యాప్ ను ఫిల్ చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగినా అవి వ‌ర్క్ వుట్ కాలేదంటారు.

ఈ ఇష్యూను సెటిల్ చేయ‌టానికి నాగ్ స్వ‌యంగా ప్ర‌య‌త్నించిన‌ట్లుగా చెబుతారు. కానీ.. ఇరువురి మ‌ధ్య దూరం మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టి వారిద్ద‌రి మ‌ధ్య‌న గ్యాప్ ఉంద‌న్న మాట‌ను చెబుతుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ ఇరువురు క‌లిసేది ఎప్పుడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. త్వ‌ర‌లోనే ఒక కార్య‌క్ర‌మంలోఇద్ద‌రు హీరోలు క‌ల‌వ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

టీఎస్సార్ అవార్డుల ఫంక్ష‌న్ లో ఈ ఇద్ద‌రు హీరోలు ఒక వేదిక మీద‌కువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఈ సంద‌ర్భంగా ఇరువురు హీరోలు ఎదురెదురు ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. టీఎస్సార్ అవార్డుల్లో భాగంగా బెస్ట్ యాక్టర్ కేట‌గిరి విభాగంలో నాగార్జున పేరును.. బెస్ట్ హీరో కేట‌గిరీలో బాల‌కృష్ణ పేరును ప్ర‌క‌టించారు. మామూలుగా అయితే.. ఇలాంటి ప్రోగ్రామ్స్ కు ప‌క్కాగా వ‌స్తార‌న్న న‌మ్మ‌కం లేక‌పోవ‌చ్చు. కానీ.. పిలుస్తోంది సుబ్బిరామిరెడ్డి కావ‌టంతో ఇద్ద‌రు హీరోలురావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌రిద్ద‌రు ఎదురెదురు ప‌డిన‌ప్పుడు మ‌ర్యాద కోస‌మైనా ఫోటోల‌కు ఫోజులివ్వ‌టం ఖాయ‌మంటున్నారు.

బాల‌కృష్ణ‌తో క‌లిసి పోవ‌టానికి నాగ్ ఎప్ప‌టి నుంచో సిద్దంగా ఉండ‌టం ఒక సానుకూలాంశ‌మైతే..ఇటీవ‌ల కాలంలో బాల‌కృష్ణ తీరుచాలానే మారింద‌న్న మాట ఉంది. న‌లుగురిని క‌లుపుకుపోయేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయంగా.. చిత్ర ప‌రిశ్ర‌మలో త‌న బ్రాండ్‌ను మ‌రింత పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్న బాల‌కృష్ణ‌.. మ‌న్మ‌దుడితో క‌లిసి ఫోటోల‌కు ఫోజులిచ్చి.. గ‌తంలో పెరిగిన దూరాన్ని తగ్గించే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News