శివ.. తెలుగు సినిమా గమనాన్ని మార్చిన సినిమా. అసలు మన ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే.. ‘శివ’కు ముందు, ‘శివ’కు తర్వాత అని వేరు చేసి మాట్లాడుకునే పరిస్థితి. అది తెలుగు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మీద కూడా ‘శివ’ ప్రభావం ఉంది. ఆ సినిమా తర్వాత ఇటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇటు హీరో నాగార్జున ఎలా ఎదిగారో తెలిసిన సంగతే. ఈ కాంబినేషన్లో ఆ తర్వాత ఇంకో రెండు సినిమాలొచ్చాయి. అవే.. గోవిందా గోవిందా.. అంతం. ఆ రెండు సినిమాలూ అంచనాల్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ అవి చెత్త సినిమాలేమీ కావు. అవి ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు చూసినా బాగానే అనిపిస్తాయి. వాటికి కూడా క్లాసిక్ స్టేటస్ ఇవ్వొచ్చు.
ఐతే నాగ్-వర్మ కాంబో అనగానే ఇప్పటికే అందరికీ ‘శివ’నే గుర్తుకొస్తుంది. దాని గురించే మాట్లాడుకుంటారంతా. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు విజయాలందుకోకపోయినా.. ‘శివ’ ద్వారా వచ్చిన గౌరవాన్నయితే దెబ్బ తీయలేదు. నాగ్-వర్మ కాంబో గురించి అందరూ గొప్పగానే మాట్లాడుకునేవాళ్లు ప్రతిసారీ. కాబట్టి అంతటితో ఆగిపోతే బాగానే ఉండేది. కానీ ఈ జోడీ ఊరికే ఉండకుండా ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలిసి ‘ఆఫీసర్’ సినిమా చేసింది. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద పరాజయంగా నిలిచిపోయింది. రెండో రోజు నుంచే థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడంతో ఎగ్జిబిటర్లు తమంతట తాముగా షోలు ఆపేసే పరిస్థితి వచ్చింది. టాలీవుడ్ చరిత్రలోనే ఒక పెద్ద హీరో సినిమాకు ఇలాంటి అవమానం ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇది నాగార్జునకు.. వర్మకు ఘోర పరాభవమే. ఇక వీళ్ల కాంబినేషన్ గురించి జనాలు మాట్లాడటానికే వీలు లేకుండా చేసింది ‘ఆఫీసర్’. నాగ్-వర్మ అనగానే ఇంతకుముందు ‘శివ’ గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు ‘ఆఫీసర్’ తలపుల్లోకి వస్తోంది. ‘శివ’ ద్వారా ఇన్నాళ్లు వీళ్లు నిలబెట్టుకున్న గౌరవం మొత్తాన్ని ‘ఆఫీసర్’ పోగొట్టేసింది. ఒకరి గురించి ఒకరు కానీ.. మరొకరు కానీ మాట్లాడలేని పరిస్థితి తెచ్చిపెట్టింది.