వెంకీ..నాగ్ ! చిరు..బాల‌య్య‌తో సమాంత‌రంగా లేరే?

Update: 2022-12-01 02:30 GMT
చిరంజీవి..బాల‌కృష్...వెంక‌టేష్‌..నాగార్జున ఈ న‌లుగురు స‌మ‌కాలీకులు. ఒక‌ప్పుడు న‌లుగురు హీరోల మ‌ధ్య పెద్ద ఫ్యారే వాడే న‌డిచేది. పోటాపోటీగా న‌లుగురు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేవి. అభిమానుల మ‌ధ్య వైరం అప్ప‌ట్లో అలాగే క‌నిపించేది. ఆ త‌ర్వాత త‌రం నటులు వ‌చ్చేస‌రికి మొత్తం సీన్ మారిపోయింది. బాల‌య్య‌..చిరుల మ‌ధ్య పోటీ అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంది.

నాగ్..వెంకీలు మాత్రం ఆ త‌ర్వాత రేసులో క‌నిపించ‌లేదు. చాలా సెల‌క్టివ్ గానే సినిమాలు చేస్తున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఆ వేగం కూడా త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తుంది. చిరంజీవి..బాల‌య్య ఒకేసారి రెండు..మూడు సినిమాల షూటింగ్ ల‌కు హాజ‌ర‌వుతున్నారు. కొత్త ప్రాజెక్ట్ ల‌కు  వేగంగానే సంత‌కాలు చేస్తున్నారు. కానీ నాగ్..వెంకీ ల్లో ఆజోష్ క‌నిపించ‌లేదు. పాండిమిక్ ద‌గ్గ‌ర నుంచి ఇద్ద‌రు వేగం మ‌రింత  త‌గ్గింది.

వెంక‌టేష్ త‌న సినిమాల్ని ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఎఫ్ -3 త‌ప్ప అంత‌కు ముందు చేసిన సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఇక నాగార్జున ఓటీటీలో కూడా సంద‌డి చేయ‌డం లేదు. ఆయ‌న ఇమేజ్ కిత‌గ్గ క‌థ‌లు రాక‌పోవ‌డంతో సెల‌క్ష‌న్ లో జాప్యం జ‌రుగుతోంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ఘోస్ట్` ఫ‌లితం ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో  జోష్ నెమ్మ‌దించింది.

అలాగే  ఇద్ద‌రు హీరోలు మార్కెట్ ప‌రంగానూ కొంత ప్ర‌తికూల‌త‌ను ఎదుర్కుంటున్నారు. యువ హీరోల‌కు గిరాకీ పెర‌గ‌డంతో సీనియ‌ర్ స్టార్లు నెమ్మ‌దించాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తుంది. మ‌రి ఇద్ద‌రు హీరోలిప్పుడు ప్ర‌త్యామ్నాయంగా ఏం చేస్తున్నారంటే వ్యాపారాల్లో  బిజీ అయిన‌ట్లు వినిపిస్తుంది.

సొంత వ్యాపారాలు చూసుకుంటూనే మ‌న‌సుకు న‌చ్చిన క‌థ‌లు కుదిరితే సైన్ చేస్తున్నారు లేదంటే?  లైట్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. `ఎఫ్ -3` రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి వెంక‌టేష్ ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. `ఘోస్ట్` త‌ర్వాత నాగార్జున సన్నివేశం అలాగే క‌నిపిస్తుంది. ఇలాగే కొనసాగితే ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వ‌డం క‌ష్టం.  అటుపై గ్యాప్ మ‌రింత పెరుగుతుంది. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వ‌డం క‌ష్ట‌మ‌వుతుంది అన్న వాద‌న వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News