బిగ్‌ బాస్ గ్రాండ్ ఫైన‌ల్లో కింగ్‌

Update: 2018-09-11 07:35 GMT
తెలుగింట ఏ నోట విన్నా బిగ్ బాస్ గురించే. మాస్‌ లో ఈ షో పెద్ద స‌క్సెసైంది. ప్ర‌స్తుతం నాని హోస్టింగ్ చేస్తున్న బిగ్‌ బాస్ సీజ‌న్ మ‌రో రెండు వారాల్లో ముగుస్తున్న సంగ‌తి తెలిసిందే. హౌస్ నుంచి ఒక్కో స‌భ్యుడు లేదా స‌భ్యురాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. ఇక గ్రాండ్ ఫైన‌ల్స్ కి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ నెలాఖ‌రు నాటికి సీజ‌న్ 2 ముగుస్తోంది. అయితే ముగింపు ఘ‌నంగా ఉండాలంటే ఈ షో లైవ్‌ లోకి బిగ్ షాట్ ఎవ‌రిని తేవాలి? అని ఆలోచించిన స్టార్ - మా ఓ తెలివైన ప్లాన్‌ నే వేసిందిట‌.

గ్రాండ్ ఫైన‌ల్స్‌ కి ఈసారి `సీజ‌న్ 1 హోస్ట్ ఎన్టీఆర్` వ‌స్తే బావుంటుంద‌ని అందుకు ప్ర‌య‌త్నం చేశారు. కానీ తార‌క్ ప్ర‌స్తుతం ఆ మూడ్‌ లో లేన‌ని స్టార్ - మా వాళ్ల‌కు చెప్పేశార‌ట‌. ఓవైపు తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణంతో తార‌క్ బాగా కుంగిపోయాడు. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోని అర‌వింద స‌మేత చిత్రీక‌ర‌ణ పెండింగులో ప‌డిపోయింది. ఈ గ్యాప్‌ ని ఫిల్ చేయాలంటే పూర్తి క‌మిట్‌ మెంట్‌ తో లొకేష‌న్‌ కే అంకిత‌మ‌వ్వాల్సి ఉంటుంది. అందుకే స్టార్ - మా ప్ర‌పోజ‌ల్‌ ని తిరస్క‌రించాడ‌ట‌.

అలాంట‌ప్పుడు ఈ షోలోకి ఎవ‌రొస్తే బావుంటుంది? అంటే `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` హోస్ట్ నాగార్జున అయితే బావుంటుంద‌ని అలోచించార‌ట‌. అటు నాగ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. బిగ్‌ బాస్ గ్రాండ్ ఫైన‌ల్స్‌ కి నాగార్జున విచ్చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా త‌న సినిమా `దేవ‌దాస్` రిలీజ్ నెలాఖ‌రున (సెప్టెంబ‌ర్ 27న) ఉంది కాబ‌ట్టి..  బిగ్‌ బాస్ హౌస్‌ లోనే నాగార్జున‌ ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేశార‌ట‌. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు త‌ర్వాత నాగ్ మ‌ళ్లీ ఇప్పుడే ఇలా బుల్లితెర‌పైకి అడుగుపెడుతున్నారు. అతిధిగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫైన‌ల్స్‌ని ర‌క్తి క‌ట్టించ‌నున్నారు. స్టార్‌- మా అమ్మ‌కంతో నాగార్జున‌కు భారీగా షేర్ ముట్టిన సంగ‌తి తెలిసిందే. చానెల్ అమ్మ‌కం త‌ర్వాత చ‌క్క‌ని స‌త్సంబంధాల్ని కొన‌సాగిస్తున్నారు. బిగ్‌ బాస్ షో సీజ‌న్ 2 హోస్టింగుకి తార‌క్ నో చెప్పాక నాగార్జున‌నే స్టార్ -మా సంప్ర‌దించింది. కింగ్ కూడా నో చెప్పాకే, నానిని సంప్ర‌దించిన సంగ‌తి విదిత‌మే.
Tags:    

Similar News