`సోగ్గాడే చిన్ని నాయనా` లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించారు కళ్యాణ్ కృష్ణ. ఆ వెంటనే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ప్రకటించారు. కానీ ఈలోగానే ఈ మూవీకి రకరకాల అడ్డంకులు. మధ్యలో నాగ్ ఎడా పెడా సినిమాలు చేశారు. మన్మధుడు 2 లాంటి డిజాస్టర్ లోనూ నటించారు.
కళ్యాణ్ వందశాతం స్క్రిప్టుతో మెప్పించలేదని దాంతో కరెక్షన్స్ చెప్పారని కొంతకాలం ఇవే కారణాలు చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమానే ఉండదు క్యాన్సిల్ అని కూడా ప్రచారమైపోయింది. కానీ కళ్యాణ్ కృష్ణ మాత్రం స్క్రిప్టు పని ఆపలేదు. అతడికి వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా ఇబ్బంది ఎదురైంది. కళ్యాణ్ కృష్ణ సోదరుని ఆకస్మిక మరణం వల్ల కూడా ఈ మూవీ డిలే అయ్యింది.
ఇప్పటికీ ఈ మూవీ మొదలవుతుందా అవ్వదా? అంటూ ఇండస్ట్రీలో చర్చ సాగుతూనే ఉంది. ఆ క్రమంలోనే తాజా చిత్రం వైల్డ్ డాగ్ రిలీజ్ ప్రమోషన్స్ లో ఉన్న నాగార్జున బంగార్రాజు గురించి క్లారిటీనిచ్చారు. ఈ సినిమాను జూన్ లో మొదలు పెట్టి.. సంక్రాంతి బరిలో విడుదల చేయనున్నట్టు నాగార్జున ప్రకటించారు. ప్రీప్రొడక్షన్ పూర్తయింది. నటీనటుల్ని ఫైనల్ చేసేస్తున్నామని తెలిపారు.
వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తారు. హిందీ బ్లాక్ బస్టర్ రైడ్ కి రీమేక్ ఇదని చెబుతున్నారు. ఈ మూవీని జూన్ లోపే పూర్తి చేసి బంగార్రాజు సెట్స్ కెళతారట. మరోవైపు బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర షూట్ పూర్తయింది. అలాగే యాత్రదర్శకుడితోనూ నాగ్ ఓ సినిమా ప్లాన్ చేశారు.
అయితే ఈ లైనప్ ని విశ్లేషిస్తే... కచ్ఛితంగా బంగార్రాజు ఇన్ టైమ్ లో స్టార్టయి సంక్రాంతికి వచ్చేస్తుందా? అన్న సందేహం ఉంది. అలాగే సంక్రాంతి 2022 బరిలో పవన్ -క్రిష్ మూవీతో పాటు మహేష్ సర్కార్ వారి పాట పోటీబరిలో నిలిచాయి. వాటితో పోటీపడుతూ బంగార్రాజు ఏమేరకు బాక్సాఫీస్ వద్ద నెగ్గుతాడు? అన్న విశ్లేషణా సాగుతోంది.
అప్పట్లో సోగ్గాడే చిత్రం భారీ కాంపిటీషన్ నడుమ సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టింది. అదే తీరుగా బంగార్రాజును తెలివిగా కొంత గ్యాప్ తో రిలీజ్ చేసి పండగ రేసులో పెద్ద హిట్టు కొట్టాలన్నది నాగార్జున ప్లాన్ అని తెలిసింది. కింగ్ ఏం చేసినా కానీ బంగార్రాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన టైమ్ వచ్చిందన్నమాట.