అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘ఊపిరి’కి పొట్లూరి వర ప్రసాద్ రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టానంటే నమ్మశక్యం కాలేదు. కానీ ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటుంటే.. బడ్జెట్ ఆ స్థాయికి చేరడంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తుంది. నాగ్ ఈ సినిమా అంతా చక్రాల కుర్చీకే పరిమితమయ్యే పాత్రలో కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన కూర్చున్న ఆ చక్రాల కుర్చీ ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు పెట్టి ఆ కుర్చీ చేయించిందట పీవీపీ సంస్థ.
మరీ అంత ఖర్చు పెట్టేంత ప్రత్యేకత ఏముంది ఆ కుర్చీలో అని ఆశ్చర్యం కలగడం ఖాయం. ఐతే అది స్వీడన్ లో ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించిన కుర్చీ అట. నాగ్ పోషించే పాత్రకు కాళ్లు చేతులు అన్నీ చచ్చుబడిపోయి ఉంటాయి. ఏమాత్రం అందులో కదలిక వచ్చినా.. పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుంది. అందుకే శరీరంలో ఏ కదలికలు లేకుండా ఉండేలా ఈ చక్రాల కుర్చీలో నియంత్రించే ఏర్పాట్లు ఉంటాయట. అందుకే ఆ కుర్చీకి అంత ఖర్చయిందట.
‘ఊపిరి’ ఒరిజినల్ ‘ది ఇన్ టచబుల్స్’ నిర్మాతలు కూడా ఇలాంటి కుర్చీనే ప్రత్యేకంగా తయారు చేయించారట. ఆ సంస్థకే ఆర్డర్ ఇచ్చి పీవీపీ వాళ్లు కూడా కుర్చీని తయారు చేయించుకుని వచ్చారట. నిర్మాణ విలువల విషయంలో పీవీపీ ఏమాత్రం రాజీ పడదని వాళ్ల గత సినిమాలు చూస్తే అర్థమవుతుంది. తెలుగు - తమిళ భాషల్లో ఈ శుక్రవారమే ‘ఊపిరి’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.