అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ రాజు గారి2 రిలీజ్ కి రెడీ అయిపోయింది. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం కోసం.. నాగార్జున ముందుగానే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేశారు. మరో మూడు రోజుల్లో తన కుమారుడు నాగచైతన్య వివాహం కానుండడంతో.. ప్రచార పనులను ముందుగానే మొదలుపెట్టారు నాగ్.
ప్రస్తుతం నాగ్ క్లీన్ షేవ్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే.. రాబోయే కొన్ని నెలల పాటు తనకు ఎలాంటి షూటింగ్స్ లేకపోవడంతో.. కొత్తగా ట్రై చేద్దామని భావించారట ఆయన. ఈ లుక్ కి రెస్పాన్స్ కూడా బాగుండడంతో.. తను కూడా థ్రిల్ ఫీలవుతున్నట్లు నాగార్జున చెప్పారు. అయితే.. రాజు గారి గది2 మూవీ అనుకున్నదానికంటే ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఓంకార్ కు గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడరాదని తాను ముందే గట్టిగా చెప్పానంటున్నారు నాగార్జున.
ముంబైలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ పనులు అనుకున్నదానికంటే ఆలస్యం అయినట్లు వివరించిన ఆయన.. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను రీషూట్ చేయించానని అన్నారు. ఇప్పుడు ఫైనల్ ఔట్ పుట్ తనకు సంతృప్తిని ఇచ్చిందని.. తొలిసారిగా తాను హారర్ కామెడీ జోనర్ లో చేస్తున్న మూవీపై ఆసక్తిగా ఉన్నానని నాగ్ చెప్పారు. అలాగే.. ఈ మూవీలో సమంతతో కలిసి నటించిన నాగ్.. తమ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని.. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఊపిరి బిగబట్టేలా సినిమా ఉంటుందని చెప్పారు.