కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు ఎవర్ గ్రీన్ గా ఆ ఉంటాయి. వాటిని ఎంత కాలం తర్వాత చూసినా.. ఆ ఫ్లేవర్ మళ్లీ మళ్లీ మైమరపింపజేస్తుంది. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సోగ్గాడే చిన్ని నాయనా’. అలాంటి పాత్రల్లో ఒకటి బంగార్రాజు. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం 2016లో రిలీజ్ అయ్యింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అసలైన తెలుగింటి చిత్రంగా కనువిందు చేసిన ఈ చిత్రం.. ప్రతి ఒక్కరినీ మైమరపింపజేసింది.
నాగార్జున కెరీర్లోనే ఆల్ టైమ్ స్పెషల్ మూవీగా నిలిచిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి.. సీక్వెల్ నిర్వహించేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. పేరు కూడా ‘బంగార్రాజు’ అని ఎప్పుడో ఫిక్స్ చేశారు. కానీ.. సినిమా మాత్రం ఇప్పటి వరకు మొదలు కాలేదు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఈ మాట వినిపిస్తూనే ఉందికానీ.. ముందుకు మాత్రం కదల్లేదు.
స్క్రిప్టు విషయంలో తేడా రావడం వల్లనే ఆలస్యమైందని తొలుత ప్రచారం జరిగింది. ఈ కారణంగా నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అన్నారు. ఆ తర్వాత పలు మార్లు.. బంగార్రాజు వచ్చేస్తున్నాడు అని ప్రచారం జరిగిందికానీ.. వచ్చింది లేదు. ఈ కోవలోనే మరోసారి ఈ విషయమై ఓ ఫీలవర్ వచ్చేసింది. బంగార్రాజు మళ్లీ రాబోతున్నాడన్నది దాని సారాంశం.
ఇంకా పక్కాగా చెప్పాలంటే.. ఆగస్టు చివరాఖర్లో ఈ సినిమాకు కొబ్బరి కాయ కొట్టబోతున్నారనే చర్చ ఫిల్మ్ నగర్లో జరుగుతోంది. దర్శకుడు కల్యాణ్ కృష్ణ సంవత్సరాల తరబడి కూర్చుని, మార్చి మార్చి రాసిన స్క్రిప్టుపై నాగార్జున సంతృప్తి వ్యక్తం చేశాడని టాక్. దీంతో.. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని అంటున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటించబోతుండడం విశేషం. మరి, ఈసారైనా నిజంగా కొబ్బరికాయ కొడతారా? లేదా? అన్నది చూడాలి.