ఈ వేడుక బ్లాక్ బస్టర్ అవుతుందా?

Update: 2017-05-26 06:50 GMT
అక్కినేని వంశం నుంచి హీరోగా 2009లో జోష్ మూవీతో పరిచయమయ్యాడు నాగ చైతన్య. ఇప్పటికి 8 ఏళ్లు గడిచిపోయినా.. ఈ అక్కినేని హీరోకు ఇంకా ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. పలు రకాల థీమ్స్ తో పాటు రెగ్యులర్ మూవీస్ చేసినా అక్కినేని ఫ్యాన్స్ కు చైతు ఇంకా బ్లాక్ బస్టర్ ఇవ్వడంలో పెండింగ్ పడ్డాడు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100 పర్సెంట్ లవ్ మంచి  హిట్ సాధించినా.. ఖర్చు ప్రకారం ఇది హిట్ దగ్గరే ఆగిపోయింది. గతేడాది వచ్చిన ప్రేమమ్ చిత్రానికి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చినా.. రిలీజ్ తర్వాతి ప్రమోషన్స్ లో అలసత్వం చూపడంతో.. ఇది కూడా హిట్ రేంజ్ దగ్గరే నిలిచిపోయింది. మనం మూవీ ఘన విజయం సాధించినా.. ఆ క్రెడిట్ నాగార్జునకే దక్కుతుంది. అందుకే ఇవాళ రిలీజ్ అవుతున్న 'రా రండోయ్ వేడుక చూద్దాం' మూవీపై నాగార్జున చాలా పట్టుదలగా ఉన్నారు.

తన సినిమా షూటింగ్స్ పక్కన పెట్టి మరీ.. ఈ సినిమా ఔట్ పుట్ పర్ఫెక్ట్ గా ఉండేందుకు తపన పడ్డారు. 'వస్తున్నాం.. కొడుతున్నాం' అంటూ పంచ్ డైలాగ్ కూడా రిపీట్ చేశారు నాగ్. యంగ్ హీరోస్ లో దాదాపు అందరికీ బ్లాక్ బస్టర్స్ ఉన్నా నాగచైతన్య మాత్రం ఆ ఫీట్ సాధించలేకపోయాడు. అక్టోబర్ లో పెళ్లి చేసుకుని జీవితానికి టర్నింగ్ ఇచ్చుకుంటున్న నాగ చైతన్య..'రా రండోయ్ వేడుక చూద్దాం' తో బ్లాక్ బస్టర్ కొట్టేసి కెరీర్ కి కూడా బూస్టప్ ఇవ్వాలని భావిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News