సినీ..రాజకీయ వర్గాలకు చెందిన వారితో పాటు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలువురి మీద రెండు రోజుల క్రితం ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహించటం తెలిసిందే. ఇదిగో తోక అంటూ అదిగో పులి అనే పరిస్థితులు ఉన్న వేళ.. ఐటీ సోదాలపై వార్తలు వేసే క్రమంలో పలువురు ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి.
టాలీవుడ్ లో మాంచి పేరున్న సురేష్ ప్రొడక్షన్ తో పాటు నిర్మాత సురేష్ బాబు.. హీరో వెంకటేశ్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ పేర్లకు తోడుగా నాగార్జున.. నానితో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్.. సితారా ఎంటర్ టైన్మెంట్స్ లాంటి నిర్మాణ సంస్థల మీదా అధికారులు దాడులు నిర్వహించినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే.. ఈ పేర్లలో తనకే మాత్రం సంబంధం లేకున్నా.. తన పేరు రావటంపైనా.. ప్రచారం జరగటంపైనా నాగార్జున తెగ వర్రీ అవుతున్నారట. తన ఇంట్లోనూ.. ఆఫీసులోనూ ఎలాంటి సోదాలు నిర్వహించకున్నా.. ఐటీ రైడ్స్ జరిగినట్లుగా వార్తలు రావటంతో నాగ్ సన్నిహితులు పలువురు ఆయనకు ఫోన్లు చేస్తూ పరామర్శిస్తున్నారట.
ఇలాంటివేళ.. తన మీద వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు నాగ్. తన స్నేహితులు పలువురు ఫోన్లు చేసి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారట కదా అని అడుగుతున్నారని.. కానీ అలాంటివేమీ జరగలేదన్నారు. తనపై వచ్చిన వార్తలు.. తనకు ఇబ్బందికరంగా అనిపించాయన్నారు.
ఈ సందర్భంగా ఎంబ్రాసింగ్ ఎమోజీ పెట్టి ట్వీట్ చేయటం ద్వారా తానెలా ఫీల్ అవుతున్నానన్న విషయాన్ని చెప్పేశారు నాగ్. ప్రముఖులు కానీ సామాన్యులు కానీ.. ఒక మీద ఏదైనా ఆరోపణ చేసే వేళలో.. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ.. అలాంటివేమీ లేకుండా రాసేయటం.. టెలికాస్ట్ చేసేయటం ద్వారా వేదనకు గురి చేస్తున్న వైనం నాగ్ ఎపిసోడ్ తో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.