పున్నూ - బాబాని ఏకిప‌రేసిన నాగ్‌... వ‌రుణ్ సేఫ్‌

Update: 2019-09-29 06:12 GMT
ఎప్పటిలాగానే ఈ శనివారం ఎపిసోడ్ లో కూడా నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులకు గట్టిగా క్లాస్ పీకారు. మొదట వరుణ్-రాహుల్ లకు క్లాస్ పీకిన నాగ్....తర్వాత పునర్నవి - బాబా భాస్కర్ లని ఓ రేంజ్ లో ఏకిపారేశారు. మొన్న టాస్క్ లో కొట్టుకున్న రాహుల్-వరుణ్‌కు జరిగిన తప్పులని చెప్పి..ఇద్దరి చేత క్షమాపణ చెప్పించారు. తర్వాత రాహుల్-వరుణ్ మధ్య అంత గొడవ జరుగుతున్న పున్నూ అంపైర్ లా చూస్తూనే ఉంది తప్ప...ఆపలేదని పున్నూ బిహేవియర్ ని తప్పుబట్టారు.

అలాగే ఇంట్లో ఎన్నిసార్లు బూతులు మాట్లాడిందో వాటికి సంబంధించిన వీడియోని ప్లే చేసి చూపించారు. రవి ఎదవ అని.. రాహుల్‌ హౌలే అని - బుల్ షిట్ అంటూ మాట్లాడినా పదాల గురించి చెబుతూ... ఇలాగేనా మాట్లాడేది మీ ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతావా? అంటూ ప్రశ్నించారు. బయటకు వచ్చిన తరువాత పునర్నవి బూతుల సెంటర్ అని బోర్డ్ పెట్టుకుని క్లాస్‌ లు ఇవ్వు అని పున్నూకి గట్టిగానే క్లాస్ పీకారు.

ఇక పున్నూ తర్వాత బాబా భాస్కర్ ని ...బాబా ‘మాస్కర్’ అని పిలుస్తూ ఆయన ఇంట్లో ఎన్ని వేరియషన్స్ తో మాట్లాడారో నాగ్ ఆ వీడియోలని ప్లే చేసి చూపించారు. ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి ఒకరో దగ్గర ఒకోలా మాట్లాడటం సరికాదని చెబుతూ...ప్రతిదాన్ని కామెడీ చేయొద్దని బాబాకి గట్టిగా గడ్డి పెట్టారు. తర్వాత ఇంటి సభ్యులతో బ్రోకెన్ హార్ట్ అనే గేమ్ ఆడించారు. మీ హార్ట్ బద్దలు కొట్టేలా హర్ట్ చేసిన వాళ్ల దగ్గరకు వెళ్లి హార్ట్ సింబల్‌ ని బ్రోక్ చేయాలని చెప్పారు. ఇందులో ఎక్కువ మంది బాబా భాస్కర్ దగ్గర హార్ట్‌ ని బ్రేక్ చేశారు.

ఈ టాస్క్ అయిపోయాక ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నవారిని సేఫ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఎలిమినేషన్ లో శ్రీముఖి - బాబా భాస్కర్ - వరుణ్ - రవిలు ఉండగా...వీరికి నాలుగు బాక్సులు ఇచ్చి - అందులో ఫోటో వచ్చిన వారు సేఫ్ అవుతారని చెప్పారు. నలుగురులో వరుణ్ బాక్సులో తన ఫోటో వచ్చింది. దీంతో వరుణ్ సేఫ్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్ లో ముగ్గురులో ఇద్దరు సేఫ్ అయ్యి - ఒకరు ఇంటి నుంచి బయటకెళ్లనున్నారు. ఇక ఇప్ప‌టికే ర‌వికృష్ణ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ‌తార‌ని లీకులు వ‌చ్చేస్తున్నాయి.



Tags:    

Similar News