జ్యోతక్కపై అలీ సెటైర్లు: రాహుల్ - వరుణ్‌ కు క్లాస్ పీకిన నాగ్...

Update: 2019-09-29 05:48 GMT
బిగ్ బాస్ షో ఎపిసోడ్ లు గడిచేకొద్దీ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. మొన్నటివరకూ కలిసి ఉన్న హౌస్ మేట్స్ మధ్యే గొడవలు మొదలవుతున్నాయి. ఎవరికి వారే వ్యూహాలు రచిస్తూ...గేమ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో 69 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని శనివారం 70వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున...శుక్రవారం హౌస్‌ లో జరిగిన ఘటనలని మన టీవీ ద్వారా చూపించారు. కటింగ్ చేసుకున్న తర్వాత ఒకరు హౌస్ లో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని శివజ్యోతిని ఉద్దేశించి అలీ సెటైర్ వేశాడు.

దీంతో జ్యోతి వచ్చి అలీ ఒళ్ళో కూర్చుని రెండు చెంపలు వాయించేసింది. హౌస్ లో హింస ఉండకూడదని అలీ చెప్పే ప్రయత్నం చేసిన జ్యోతక్క ఎడాపెడా చెంపలు మీద కొట్టేసి పారిపోయింది. ఇక ‘డాబర్ పేస్ట్’ ప్రమోషన్స్ కొరకు ఓ టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి ఆట ఆడారు. ఇందులో శ్రీముఖి - బాబా భాస్కర్ - వరుణ్ - వితికా - రవి ఉన్న టీం విజయం సాధించింది.

తర్వాత నాగార్జున మనటీవీ ద్వారా ఇంటి సభ్యులని పలకరించారు. ఆ వెంటనే ఈవారం టాస్క్‌ లో భాగంగా గొడవ పడ్డ వరుణ్ - రాహుల్‌ లని కన్ఫెషన్ పక్క రూమ్ లోకి వెళ్లమన్నారు. అక్కడ డాక్టర్ కి దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయో చూపించాలని ఇద్దరికి చెప్పారు. దీంతో వారు దెబ్బలని చూపించారు. అందులో వరుణ్ కు కొంచెం ఎక్కువగా దెబ్బలు ఉన్నాయని డాక్టర్ నాగార్జునకు చెప్పింది. తర్వాత వారిని లివింగ్ రూమ్ లోకి పిలిచి నాగార్జున ఇద్దరికీ క్లాస్ పీకారు.

ఇద్దరి తప్పులని చెబుతూ...మొన్న గొడవని వీడియో ద్వారా చూపించారు. చివరికి వాళ్లిద్దరూ రియలైజ్ అయ్యి ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడంతో వివాదానికి పుల్ స్టాప్ పడింది.


Tags:    

Similar News