కింగ్ అంత సాహసం చేయగలడా?

Update: 2019-01-16 08:57 GMT
ఇప్పుడు బయోపిక్ ల సీజన్ ఉదృతంగా నడుస్తోంది. మహానటి పుణ్యమా అని సుమారు ఐదుకి పైగా సినిమాలు ఒక్క తెలుగులోనే రూపొందుతున్నాయి. అయితే దాన్ని మించిన స్థాయిలో ఆడుతుందని ఆశించిన ఎన్టీఆర్ కథానాయకుడు కమర్షియల్ ఫెయిల్యూర్ దిశగా అడుగులు వేస్తుండటంతో నిర్మాణంలో ఉన్నవాటిని పక్కన పెడితే కొత్తగా ఆలోచన చేస్తున్న వాళ్ళను మాత్రం వెనక్కు లాగేలా ఉంది. ఎంత గొప్ప నటీనటులైనా వాళ్ళ జీవితం తెరమీద కాసులు కురిపించాలి అంటే డ్రామా అవసరం. అది లేకుండా ఎంత ఎమోషన్ ని పండించినా అది ప్రేక్షకుడికి కనెక్ట్ కాదని ఎన్టీఆర్ రుజువు చేసింది.

సావిత్రి జీవితంలో విషాదం వ్యక్తిత్వంలోని బలహీనత సినిమాను బ్లాక్ బస్టర్ చేసాయి. సో అవి మిస్ అయిన ఎన్టీఆర్ ఒక లెసన్ గా మారిపోయింది. అయితే మునుముందు ఇంకెవరైనా తీసే సాహసం చేస్తారా అంటే ఇప్పటికైతే నో అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరి కళ్ళు అక్కినేని నాగేశ్వర్ రావు గారి బయోపిక్ వచ్చే అవకాశం ఉందా అనే దాని మీదే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నాగార్జున ఒకదశలో ఆ ఆలోచన చేసినప్పటికీ తర్వాత డ్రాప్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయట. బాలకృష్ణ అంత స్టేచర్ ఉన్న నటుడు ఎన్టీఆర్ చేస్తేనే జనం చూడటం లేదు. అలాంటిది తనకు సూట్ కాదని సుమంత్ తో ట్రై చేస్తే మార్కెట్ ఇమేజ్ లాంటి కారణాల వల్ల ఆశించిన స్పందన రాకపోవచ్చు.

దానికితోడు అచ్చం ఎన్టీఆర్ జీవితంలాగే ఎఎన్ ఆర్ ది కూడా అంతగా ఒడిదుడుకులు లేని జీవితం. సాఫీగా సాగిపోయింది. ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రేక్షకులను పిండేసే రేంజ్ లో ఏమి ఉండవు. ఈ నేపధ్యంలో ఎఎన్ఆర్ కథను తీసుకురావడం కంటే ఏదైనా వెబ్ మూవీగానో లేదా సిరీస్ గానో తీస్తే బెటర్ అనే చర్చ జరుగుతోందట. ఇదే నిజమైతే మంచి నిర్ణయం అని చెప్పాలి. ఇవి సరే కాని ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న కాంతారావు-ఘంటసాల బయోపిక్ ల పరిస్థితి ఏంటో చూడాలి మరి
Tags:    

Similar News