ఫోటో స్టోరి: కింగ్ వ‌య‌సు ఇన్నాళ్టికి తెలిసింది

Update: 2021-07-06 02:30 GMT
న‌వ‌మ‌న్మ‌ధుడు కింగ్ నాగార్జున వ‌య‌సెంతో క‌నిపెట్ట‌గ‌ల‌రా?  ఈ ప్ర‌శ్నకు త‌డ‌బ‌డ‌నిది ఎవ‌రు? ఇటీవ‌ల వైల్డ్ డాగ్ చిత్రంలో ఆయ‌న ఏజ్ లెస్ లుక్ లో క‌నిపించారు. కానీ ఇంత‌లోనే ఇదిగో ఇలా బ‌య‌ట‌ప‌డిపోయారు.

ఆయ‌న ఏజ్ ఎంతో ఇప్ప‌టికి కానీ బ‌య‌టికి తెలియ‌నే లేదు. తాజాగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసిన ఓ ఫోటో చూసి షాక్ తినాల్సొచ్చింది. ఇదిగో ఇలా నెరిసిన జుత్తు  మీస‌క‌ట్టుతో బ‌య‌ట‌ప‌డిపోయాయి. అస‌లు ఆయ‌న మేక‌ప్ లెస్ తో క‌నిపించ‌గానే అభిమానులు షాక్ కి గుర‌య్యార‌నే చెప్పాలి.

గ‌త కొంత‌కాలంగా `నా వ‌య‌సు 30` అంటూ క‌వ‌ర్ చేస్తున్న నాగార్జున సార్ 60 ప్ల‌స్ లోనూ అంతే యాక్టివ్ గా న‌టిస్తూ నిజంగానే ఆయ‌న ఏజ్ ని మ‌రిపింప‌జేస్తున్నారు. ఫ్యాన్స్ ఎవ‌రికీ ఆయ‌న ఏజ్ పై సందేమాలు లేవు. కానీ ఎందుక‌నో ఇలా మేక‌ప్ లెస్ లో ఓపెన్ గా క‌నిపించారు నాగ్.

నిజానికి నాగార్జున ఏజ్ గురించి తెలుసుకునేందుకు ఆయ‌న అభిమానులు ఏమాత్రం ఆస‌క్తిగా ఉండ‌రు. ఆయ‌న‌ను ఇంకా న‌వ‌మ‌న్మ‌ధుడిగాను హ‌లో బ్ర‌ద‌ర్ గానే ఊహించుకుంటారు. శివ రూప‌మే ఇంకా ఇమాజిన్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కానీ ఆయ‌న ఇలా ఎందుకు చేశారో మ‌రి!

ప్ర‌స్తుతం ఆయ‌న బంగార్రాజు అనే చిత్రంలో న‌టిస్తున్నారు. `సోగ్గాడే చిన్ని నాయ‌నా` ఫేం క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌దుప‌రి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌నున్నారు. మ‌ల్టీస్టార‌ర్ బ్ర‌హ్మాస్త్ర‌లోనూ నాగార్జున కీల‌క పాత్ర‌ను పోషించారు.
Tags:    

Similar News