ఓం నమో వెంకటేశాయ రిలీజ్ డేట్ గురించి కచ్చితంగా చెప్పడానికి వెనకాడుతూ వచ్చాడు అక్కినేని నాగార్జున. గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీ లేకుండా కష్టపడుతున్నామని.. ఆ పని పూర్తయ్యాక.. సంతృప్తి చెందాకే రిలీజ్ డేట్ పక్కాగా చెబుతామని అన్నాడు నాగ్. ఇటీవలే మాట్లాడుతూ.. తాము అనుకుంటున్నట్లుగా ఫిబ్రవరిలో అయినా సినిమా రిలీజవుతుందా అన్నది డౌటే అని కూడా అన్నాడు. ఐతే నాగ్ ఇలా అన్న వారం రోజులకే ‘ఓం నమో వెంకటేశాయ’ నిర్మాత నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి.
‘‘అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున కెరీర్‌లోనే ఈ చిత్రానికి హైయెస్ట్ బిజినెస్ జరుగుతోంది. ఓవర్సీస్ రైట్స్.. శాటిలైట్ రైట్స్.. మిగతా అన్ని ఏరియాల రైట్స్.. భారీగా పలుకుతున్నాయి. బిజినెస్ చాలా బాగా జరుగుతోంది. వచ్చే ఏడాది రాబోయే సినిమాల్లో భారీ అంచనాలున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత మహేష్ రెడ్డి పేర్కొన్నాడు. నిర్మాతే అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు కాబట్టి ‘ఓం నమో వెంకటేశాయ’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 10కి ఫిక్స్ అన్నమాటే.