అక్కినేని అఖిల్ నటించిన రెండో చిత్రం హలో విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 22న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రేట్లే పలుకుతున్నట్లుగా తెలుస్తోంది.
హలో చిత్రాన్ని తమ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పైనే నిర్మించిన నాగార్జున.. బిజినెస్ వ్యవహారాలను కూడా తనే స్వయంగా డీల్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల వరకూ డీల్స్ బాగానే కుదిరాయ్ కానీ.. శాటిలైట్ - డిజిటల్ రైట్స్ దగ్గరకు వచ్చేసరికి లెక్క తేడా వచ్చేస్తోందట. పలు కంపెనీలతో ఎంతగా డిస్కషన్స్ చేస్తున్నా డీల్స్ తెగడం లేదని తెలుస్తోంది. ఇందుకు కారణం.. హలో చిత్రానికి నాగ్ చెబుతున్న రేట్లే కారణం అంటున్నారు. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. లాంటి స్టార్ రేంజ్ హీరోలతో సమానంగా రేట్లను చెబుతున్నారట నాగ్.
అఖిల్ ఫ్లాప్ ను ప్రస్తావిస్తూ.. ఇంత రేట్స్ ఎందుకు అని ప్రశ్నిస్తే.. అఖిల్ మూవీ సంగతి మర్చిపోమ్మని.. ఇది అఖిల్ కి రీలాంఛింగ్ మూవీ అని నాగార్జున చెబుతున్నారట. అఖిల్ రీలాంఛింగ్ అని నాగ్ ఫీలవుతున్న మాట కరెక్టే కానీ.. జనాలు ప్లస్ బయ్యర్స్ కూడా అలాగే ఫీలవుతారని నాగ్ ఎలా ఫిక్స్ అయిపోయారో?