గత ఏడాది నానితో కలిసి చేసిన దేవదాస్ నాగార్జునకు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది . నాన్న ఎవర్ గ్రీన్ క్లాసిక్ టైటిల్ పెట్టుకున్నా వర్క్ అవుట్ కాలేదు. దీంతో కొత్త సినిమా విషయంలో కొంత గ్యాప్ తీసుకున్న నాగ్ మన్మధుడు 2 కోసం రెడీ అవుతున్నాడు. చిలసౌతో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఇది రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12 నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారనే టాక్ ఉంది. రేపు ఎల్లుండో ప్రకటించే అవకాశం ఉంది.
ఇది నిజంగా సీక్వెలా లేక కేవలం టైటిల్ క్రేజ్ ని వాడుకుని కొత్త కథతో చేస్తున్నారా అనేది పక్కన పెడితే నాగ్ దీని విషయంలో కొంత రిస్క్ చేస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే బాహుబలిని మినహాయించి టాలీవుడ్ లో సీక్వెల్స్ ఆడుతున్న దాఖలాలు లేవు. ఆర్య లాంటి మాస్టర్ పీస్ తీసిన సుకుమార్ అదే బన్నీతో ఆర్య 2 అంటే జనం మెచ్చలేదు. రవితేజకు సూపర్ బ్రేక్ ఇచ్చిన కిక్ తర్వాత కిక్ 2గా కొనసాగితే అదే స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ మేనియాతో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ అంటే డిజాస్టర్ అయ్యి కూర్చుంది
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే మన్మధుడు 2 కోసం నాగ్ తీసుకున్నది ఫ్రెష్ స్టొరీ అని కొనసాగింపు కాదని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమనుకున్నా పైన చెప్పిన సీక్వెల్స్ కూడా వేరే కథలతో రూపొందినవే. టైటిల్ మాత్రమే సేమ్ ఉంటుంది. అసలే మన్మధుడు వచ్చి 17 ఏళ్ళు దాటింది. ఇప్పుడు దానికి కంటిన్యుయేషన్ అంటే అంచనాలు అందుకోవడం సులభం కాదు.
అందులోనూ రాహుల్ రవీంద్రన్ తీసింది ఒక్క సినిమానే. అది కూడా ఆహా ఓహో బెస్ట్ అఫ్ ది ఇయర్ అనిపించుకుంది కాదు. మంచి మార్కులతో పాస్ అయ్యింది అంతే. మరి మన్మధుడు లాంటి మాస్టర్ టైటిల్ ని టచ్ చేస్తున్నప్పుడు రాహుల్ రవీంద్రన్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. క్లారిటీ రావాలంటే ఓ టీజరో ట్రైలరో వచ్చే దాకా వెయిట్ చేయాలి