నాగార్జున హీరోగా నటించి సక్సెస్ అయిన చిత్రం వచ్చి చాలా కాలం అయ్యింది. అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న 'మన్మధుడు 2' చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. మన్మధుడు నాగార్జున కెరీర్ లోనే ఒక బిగ్ హిట్ మూవీగా నిలుస్తుంది. అలాంటి మూవీ టైటిల్ తో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగి పోయాయి. 'మన్మధుడు 2' చిత్రంను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. చిలసౌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు - కమర్షియల్ గా కూడా రాహుల్ సక్సెస్ అయ్యాడు.
ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో చేస్తున్న సందడితో సినిమాపై అందరిలో కూడా ఆసక్తి రేకెత్తుతోంది. నాగార్జునకు జోడీగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించడంతో పాటు కీలక పాత్రలో సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరియు అనుష్కలు కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంను దసరాకు విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందే ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
ఆగస్టు లో సాహో చిత్రం విడుదల ఉన్న కారణంగా ఆ నెల మొత్తం విడుదల చేయడం ఏమాత్రం మంచిది కాదు, ఇక దసరాకు కూడా పెద్ద సినిమాలు ఉన్న కారణంగా అప్పుడు కూడా విడుదల చేయడం కరెక్ట్ నిర్ణయం కాదని భావిస్తున్నారట. విడుదల తేదీ విషయంలో మన్మధుడు 2 టీం సుదీర్ఘ ఆలోచన తర్వాత జులై చివర్లో సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే శరవేగంగా సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్ చివరి వరకు షూటింగ్ ను పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రంను నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. నాగార్జున ఈ చిత్రంతో మరోసారి మన్మధుడు అనిపించుకుని సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.