రామ్ గోపాల్ వర్మ గత పదేళ్ల ట్రాక్ రికార్డు చూసి అతడితో పని చేయడానికి మీడియం రేంజి హీరోలు సైతం వెనుకాడుతున్న పరిస్థితుల్లో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అతడికి ఛాన్సివ్వడం ఆశ్చర్యం కలిగించింది. గత దశాబ్ద కాలంలో వర్మ ఎన్నెన్ని చెత్త సినిమాలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల క్వాలిటీ దారుణంగా పడిపోయింది. అాలాంటి దర్శకుడికి వర్మ ఎలా ఛాన్సిచ్చాడంటూ అందరూ ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టారు. వర్మ కథ ఎలా చెప్పినా.. తీయడంలో సిన్సియారిటీ చూపించి ఉండడనే సందేహించారు. సినిమా చేస్తున్నపుడు నాగ్ కచ్చితంగా రిగ్రెట్ అయి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ నాగ్ ఫీలింగేంటన్నది ఎవరికీ తెలియలేదు. కానీ విడుదల ముంగిట మాత్రం నాగ్.. వర్మ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ కనిపించాడు. వర్మ తన నమ్మకాన్ని నిలబెట్టాడన్నాడు. ‘ఆఫీసర్’ సినిమాను చాలా బాగా తీశాడన్నాడు.
ఐతే ఎంత చెత్త సినిమా చేసినా.. విడుదల ముంగిట ఇలాంటి మాటలే మాట్లాడతాడు ఏ హీరో అయినా. మరి నాగార్జున మాటల్లో ఎంత నిజాయితీ ఉందన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. ‘ఆఫీసర్’ ప్రోమోలు చూస్తే మాత్రం చాలా సాధారణంగానే కనిపించాయి. వర్మ గొప్ప మార్పేమీ చూపిస్తాడన్న ఆశల్లేవు. కాకపోతే వర్మ గత దశాబ్ద కాలంలో తీసిన చెత్త సినిమాల్లాగా ఇది లేకపోతే చాలు.. ఓ మోస్తరుగా ఉన్నా ఓకే అంటున్నారు అక్కినేని అభిమానులు. రెండేళ్ల ముందు సూపర్ ఫాంలో ఉన్న నాగ్.. తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. గత ఏడాది ఆయనకు ‘ఓం నమో వేంకటేశాయ’.. ‘రాజు గారి గది-2’ చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ఈ వరుసలో ‘ఆఫీసర్’ కూడా తేడా కొడితే అంతే సంగతులు. కాబట్టి నాగార్జునకు ఈ చిత్రం మంచి ఫలితాన్నివ్వడం కీలకం. మరి వర్మతో సినిమా చేయడమనే ఆయన నిర్ణయం రైటా రాంగా అన్నది ఇంకాసేపట్లో తేలిపోతుంది.