త్వరలో అఖిల్ రీ-లాంఛింగ్ ఈవెంట్!!

Update: 2016-09-11 06:59 GMT
అఖిల్ అక్కినేని గతేడాదే హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో.. నితిన్ నిర్మాతగా.. దాదాపు 45 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన అఖిల్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర పేలిపోయింది. ఈ షాక్ నుంచి నాగ్ తొందరగానే కోలుకున్నా.. అఖిల్ మాత్రం కాస్త టైమ్ పట్టింది. అందుకే రెండో సినిమా కన్ఫామ్ చేయడంలో బాగా లేట్ అయింది. చాలామంది డైరెక్టర్లను పరిశీలిచాక.. చివరకు విక్రమ్ కె కుమార్ తో సినిమాను ఫైనల్ చేశాడు తండ్రి నాగార్జున.

అఖిల్ సెకండ్ మూవీ స్టార్ట్ చేసేందుకు గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేయనున్న నాగ్.. దీనికి సినీ-రాజకీయ సెలబ్రిటీలు అందరినీ పిలవనున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాతో 'అధికారికం'గా అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రచారం చేస్తారని టాక్. ఇది రీలాంఛ్ ఫంక్షన్ అయినా.. ఇదే అసలు లాంఛింగ్ అనే రేంజ్ లో ప్రచారం చేయనున్నారట. ప్రస్తుతం పెళ్లి సందడిలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ బిజీగా ఉండడంతో.. నవంబర్ లో ఈ అఖిల్ అఫీషియల్ లాంఛింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నాడట నాగ్.

అఖిల్ ని తిరిగి లాంఛింగ్ చేయడం విషయంలో నాగ్ ఏ పాయింట్ ని వదలడం లేదని.. జ్యోతిష్యం.. అన్నిటినీ చూపించేశాడట. అసలు ఈ ఈవెంట్ సలహా కూడా వాళ్లదే అని టాక్. పైగా తనే నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించడం కూడా.. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే కదా!
Tags:    

Similar News