నాగార్జునకు ఇంత కంటే పాఠం ఉండదేమో..

Update: 2017-02-19 09:08 GMT
‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాన్ని ముందు సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత మనసు మార్చుకున్నారు. సంక్రాంతికి పోటీ మరీ తీవ్రంగా ఉందని.. పైగా అప్పటికి సినిమాను రెడీ చేయాలంటే హడావుడి అవుతుందని.. కాబట్టి ప్రశాంతంగా పోటీ లేని సమయం చూసి రిలీజ్ చేసుకుందామని వాయిదా వేశారు. చివరికి ఫిబ్రవరి 10న సినిమాను రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు ప్రధాన ప్రేక్షక వర్గం అయిన ఫ్యామిలీస్ థియేటర్లకు రాకపోవడంతో వసూళ్లు మరీ పేలవంగా వచ్చాయి. పిల్లలంతా పరీక్షల హడావుడిలో ఉండటంతో ఫ్యామిలీస్ థియేటర్ల వైపు చూడలేదు. ఇక ఎలాంటి స్థితిలో అయినా సినిమాలు చూసే మామూలు యూత్.. ‘నేనులోకల్’ లాంటి యూత్ ఫుల్ మూవీ మీద.. ‘ఎస్-3’ లాంటి మాస్ సినిమా మీద దృష్టిపెట్టారు. దీంతో ‘ఓం నమో వేంకటేశాయ’ అన్యాయమైపోయింది.

‘ఓం నమో..’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో నాగార్జున మాట్లాడుతూ.. ఒక మాటన్నాడు. ‘‘సరైన టైమింగ్ లో రిలీజ్ కాకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాలు కూడా అన్యాయం అయిపోయాయి. మంచి టైమింగ్ లో రిలీజ్ కావడం వల్ల కొన్ని చెత్త సినిమాలు కూడా ఆడేశాయి’’ అని. ‘ఓం నమో..’ విషయంలో మొదటిదే జరిగింది. ఇలాంటి సినిమా ఇప్పుడు రావాల్సింది కాదు. అదే సంక్రాంతికో.. వేసవికో వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎలాగోలా చేసి సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసి ఉంటే.. పండగ మూడ్ లో భక్తి భావంతో ఉన్న జనాలు ఈ సినిమాను బాగానే ఆదరించే వారు. సెలవుల్లో రావడం వల్ల ‘శతమానం భవతి’ లాంటి చిన్న సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టిందో చూశాం. ‘ఓం నమో..’ కూడా అప్పుడే వచ్చి ఉంటే కచ్చితంగా ఇంతకంటే మెరుగైన వసూళ్లే వచ్చి ఉండేవి. మొత్తానికి ఒక సినిమాను రిలీజ్ చేసే విషయంలో టైమింగ్ అన్నది ఎంత కీలకమో నాగార్జునకు తెలిసి కూడా తప్పు చేశాడు. ఐతే ఈసారి నేర్చుకున్న పాఠం మాత్రం ఆయనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News