అక్కినేని నాగార్జున ఇప్పుడు తన కెరీర్ మొత్తంలోనే టాప్ స్టేజ్ లో ఉన్నారు. ఎన్నో విభిన్నమైన సినిమాలతో తన స్టామినా చాటుతూ వచ్చిన నాగ్.. ఇప్పుడు సోగ్గాడే చిన్న నాయనతో 50 కోట్ల హీరోగా మారిపోయారు. అంతకు ముందు మనం మూవీతోనూ బ్లాక్ బస్టర్ కొట్టిన నాగార్జున.. సీనియర్ హీరోలకు అసాధ్యం అని అందరూ అనుకున్న ఫిఫ్టీ క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు.
ఇప్పుడు ఊపిరి మూవీతో హ్యాట్రిక్ పై కన్నేశారు నాగార్జున. ఈ మూవీ పబ్లిసిటీ కోసం విభిన్నమై పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు ఈ సీనియర్ స్టార్. ఆడియో ఫంక్షన్ ని - ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ని వేరువేరుగా నిర్వహించి ఆసక్తి కలిగించిన నాగ్.. ఇప్పుడు ఊపిరి రిలీజ్ మరో వారం రోజుల్లోకి రావడంతో.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ' నిన్న నే మూవీ చూశా. డబుల్ హ్యాపీ, మొన్న సంక్రాంతికి క్యాప్ పెట్టాను, ఇప్పుడు ఫెదర్స్ పెట్టబోతున్నా.. ఇది నాకు లైఫ్ ఛేంజింగ్ మూవీ' అంటూ ఊపిరిని పొగడ్తల్లో ముంచెత్తారు.
ఒక రకంగా నాగ్ కెరీర్ లోనే ఇది మైలు రాయిలా నిలిచిపోయే చిత్రం. సినిమా అంతా కుర్చీలోనే ఉంటూ, చేతులు కాళ్లు కదల్చకుండా కేవలం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తోనే అన్ని భావాలను పలికించే పాత్ర ఇది. ఈ మూవీ తర్వాత యాక్టర్ గా నాగార్జున స్థాయి పది రెట్లు పైకి ఎక్కడం ఖాయమనే అంచనాలున్నాయి.