ప్రపంచవ్యాప్తంగా ఆధరణ ఉన్న బిగ్ బాస్ షో ను హిందీ ప్రేక్షకులు విపరీతంగా ఆధరించారు.. ఇంకా ఆధరిస్తూనే ఉన్నారు. ఇండియాలో అత్యధికంగా రేటింగ్ దక్కించుకుని సక్సెస్ అయిన షో ల్లో హిందీ బిగ్ బాస్ ఒకటి అనడంలో సందేహం లేదు. అలాంటి బిగ్ బాస్ షో ను తెలుగు లో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలు పెట్టారు. ఒక్క సీజన్ కే ఎన్టీఆర్ గుడ్ బై చెప్పాడు.
రెండవ సీజన్ ను నాని హోస్ట్ గా నడిపించిన విషయం తెల్సిందే. ఆయన కూడా ఒక్క సీజన్ కే చేతులు ఎత్తేసి వదిలేశాడు. మూడవ సీజన్ నుండి బిగ్ బాస్ తెలుగు బాధ్యతలను నాగార్జున తీసుకున్నాడు. ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తున్న విషయం తెల్సిందే. నాలుగు రెగ్యులర్ సీజన్ లు మరియు ఒకటి ఓటీటీ సీజన్ కు నాగార్జున హోస్టింగ్ చేశాడు.
నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఆయన బిగ్ బాస్ వల్ల సినిమాలకు అన్యాయం చేస్తున్నాను అనే ఫీలింగ్ లో ఉన్నాడట. దాదాపుగా నాలుగు నెలల పాటు బిగ్ బాస్ వల్ల సినిమాల యొక్క షూట్స్ ఇబ్బంది అవుతుంది. అందుకే బిగ్ బాస్ ను వదిలేయాలనే నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది.
వచ్చే సీజన్ కి కొత్త హోస్ట్ ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సీనియర్ స్టార్ హీరోలు మొదలుకుని పలువురు యంగ్ స్టార్ హీరోల పేర్లు పరిశీలనకు ఉన్నాయట. చిరంజీవి.. బాలకృష్ణ.. విజయ్ దేవరకొండ.. మహేష్ బాబు ఇలా ఎంతో మంది పేర్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
అందులో ఎవరు ఆసక్తిగా ఉన్నారు.. నిర్వాహకులు ఎవరికి ఓటు వేస్తారు అనేది చూడాలి. బిగ్ బాస్ కు తెలుగు లో ఒక వర్గం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మంచి హోస్ట్ తో మంచి కంటెస్టెంట్స్ తో షో రన్ చేస్తే కచ్చితంగా భారీగా రేటింగ్ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.