నాన్నగారితో పోల్చిన నాగార్జున

Update: 2018-10-18 12:12 GMT
అక్కినేని నాగార్జున - నాని కాంబినేషన్ లో 'దేవదాస్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ అన్నిటిలో నానిపై ఎంతో అభిమానం కురిపించిన విషయం తెలిసిందే.  తాజా గా దేవదాస్ 50 డేస్ ఈవెంట్ లో కూడా మరో సారి నాని పై ప్రశంసల వర్ష కురిపించాడు.

నాని గురించి మాట్లాడుతూ "నటుడిగా నాని అంటే నాకు ఇష్టం. నాని సినిమాలు చూస్తుంటే నాన్నగారు తన కెరీర్ మొదట్లో చేసిన చిత్రాలు గుర్తొస్తాయి.  ఆయన డైలాగ్‌ డెలివరీ గానీ డిక్షన్‌ గానీ ఫాస్ట్‌గా ఉన్నప్పటికీ స్పష్టంగా ఉండేది.  నాని చిత్రాల్లో.. అతడి నటనలోనూ నేను అదే స్పష్టత గమనించా. అందుకే చాలా రోజుల నుండి నాని సినిమాలో నటించాలని మనసులో ఉంది.  ఈ సినిమాలో నాని తో నటించిన తర్వాత నాని వ్యక్తిగతంగా కూడా మంచివాడని తెలుసుకున్నాను" అని చెప్పాడు.

నానికి ఇప్పటివరకూ వచ్చిన ప్రశంసల్లో ఇంతకంటే భారీ ప్రశంస మరోకటి ఉండకపోవచ్చు.  లెజెండరీ యాక్టర్ అయిన ఏఎన్నార్ తో పోల్చడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఇక స్వయంగా ఏఎన్నార్ వారసుడే ఆ మాట అంటే ఇక ఐఎస్ఓ 9001 సర్టిఫికేట్ వచ్చినట్టే.  ఇదిలా ఉంటే నాని కూడా నాగార్జునపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.  'దేవదాస్' చేయకముందు నాగ్ సార్ ని చూస్తే 'శివ' గుర్తొచ్చేదని ఇప్పుడు దేవా పాత్ర గుర్తుకొస్తోందని అన్నాడు.
Tags:    

Similar News