ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాలూ.. వాటిలోని సీన్లూ.. చాలామందిని రియల్ లైఫ్ లో చాలా ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కోసారి ఆల్రెడీ సినిమాల్లో చేస్తున్న హీరోలే.. ఆ సీన్లన్నీ నిజంకాదని తెలిసినా కూడా.. బాగా ఏడ్చేస్తారు. అంటే కొన్నిసార్లు ఎమోషనల్ గా అలా కనక్ట్ అయిపోతారు. ఇక సీన్లకే కాదు.. అలాంటి స్ర్టెంగ్త్ పాటలకు కూడా ఉంటుంది.
తొలిసారిగా సాహసం శ్వాసగా సాగిపో పాటలను వింటున్నప్పుడు కింగ్ నాగార్జున పరిస్థితి కూడా అంతే. అసలే ఏ.ఆర్.రెహ్మాన్ స్వరపరిచిన ట్యూన్లు కాబట్టి.. ఖచ్చితంగా ఎలా ఉంటాయో వినేద్దాం అనే ఆతృత ఎవరికైనా ఉంటుంది. నాగ్ కూడా అలాగే చైతన్య ఇచ్చిన సిడిని పెట్టుకుని పాటలు వింటున్నాడట. ఇంతలో సడన్ గా తన రూమ్ లోనికి వచ్చిన అమల.. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగిందట. ''వెళ్లిపోమాకే సాంగ్ వింటుంటే కళ్లలో నీళ్లు వచ్చేశాయి. సాంగ్స్ వింటుంటే ఎక్కడికో వెళ్లిపోతాం. ఈ సినిమాలో పాటలన్నీ అలాగే ఉన్నాయి'' అని చెబుతూ.. తాను ఎంతగా కనెక్ట్ అయ్యానో వివరించే ప్రయత్నం చేశారు నాగార్జున.
కాకపోతే ఇలాంటి రొమాంటిక్ మరియు మూడీ పాటలను మిస్ అవుతున్నందకు బాధగా ఉందని ఫీలయ్యాడు నాగ్. ఇక 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా రెహమాన్ మ్యూజిక్‌లో ఒకే సినిమా చేశానని (రక్షకుడు సినిమా).. చైతు మాత్రం అప్పుడే రెండు సినిమాలు చేసేశాడని.. ఆ చిన్న ప్రొఫెషనల్ జెలసీ చూపిస్తూనే.. తండ్రిగా తాను ఎంత ఆనందంగా ఉంది ప్రూవ్ చేశాడు నాగ్.