నాగ్ నేర్పిస్తున్న ప్రమోషన్ పాఠాలు

Update: 2016-03-20 04:42 GMT
సీనియర్ స్టార్ అని, ఇక ఈ హీరో పని అయిపోయినట్లే అని, మల్టీ స్టారర్ లు చేసుకుంటూ కాలం గడిపేయాల్సిందేనని అనిపించుకున్న వారిలో.. మొన్నటివరకూ అక్కినేని నాగార్జున పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడా మాట అనేందుకు ఎవరికీ నోరు రాదు. ఒకే ఒక్క సినిమాతో తనేంటో చూపించాడు నాగార్జున. సోగ్గాడే చిన్ని నాయనను అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధఇంచాడు.

ఇప్పుడు ఊపిరి మూవీని తెలుగు - తమిళ్ (తోఝా)లో చేసిన నాగ్.. ఈ మూవీ కోసం కోలీవుడ్ లోనూ అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నాడు. నిజానికి మన సినిమాలు తమిళ్ లో డబ్ అవడం మామూలే కానీ.. జస్ట్ డబ్బింగ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తారంతే. మహేష్ బాబు - రామ్ చరణ్ ల వరస కూడా ఇంతే. అక్కడ ప్రమోషన్స్ అసలు పట్టించుకోరు.

నాగార్జున మాత్రం తోఝా కోసం విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు. గత రెండు రోజులుగా చెన్నైలోనే ఉన్న నాగ్.. అక్కడి  టీవీలకు - పేపర్లకు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఈ మూవీలో కార్తీ నటించడం, ఇది బైలింగ్యువల్ సినిమా కావడం అడ్వాంటేజ్ అని చెప్పాలి. దీనికి మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు కూడా తోడవడంతో.. మార్చ్ 25న విడుదలవుతున్న ఊపిరిపై రెండు భాషల్లోనూ అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
Tags:    

Similar News