కుదరితే బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిద్దాం అని చాలామంది నటులు అనుకుంటారు. అవకాశం ఉండి కూడా అలాంటి ఆఫర్లను వదులుకునేవారు ఎవరైనా ఉంటారా..? ఆ కోవకే చెందుతారు కింగ్ నాగార్జున. మంచి పాత్రలు వస్తేనే తప్ప బాలీవుడ్ చిత్రాల్లో నటించేయాలన్న కోరిక తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు హిందీ సినిమాల విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి ఓ ఆఫర్ వచ్చిందని చెప్పారు. వర్మ బాలీవుడ్ కి వెళ్తూ వెళ్తూ తనని కూడా అక్కడికి వచ్చేయమని కోరారట. అయితే, నాగ్ ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించినట్టు ఇప్పుడు చెబుతున్నారు. ‘వర్మ నన్ను ముంబైకి వచ్చేయమన్నాడు. తను వెళ్తూ వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తే బాగుంటుందని కూడా చెప్పాడు. ముంబైకి వచ్చేయడం తనకు ఇష్టం లేదని అప్పుడే స్పష్టం చేశాను. ఎందుకంటే - నాకు తెలుగు సినిమాల్లో నటించడమే ఒక నటుడిగా ఎక్కువ తృప్తిని ఇస్తుందని చెప్పాను. ఆ తరువాత కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించాను’ అని చెప్పారు నాగ్.
ఏవైనా ఆసక్తికరమైన పాత్రలు చేయాలని ఆఫర్ వస్తే హిందీ సినిమాల్లో నటించడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పారు. పాత్రలను ఎంపిక చేసుకోవడంలో బిగ్ బి అమితాబ్ తనకు ఆదర్శం అని చెప్పారు. నిజానికి, మనం సినిమాకంటే ముందుగానే రొటీన్ కథలకీ కథనాలకీ గుడ్ బై చెప్పేద్దాం అనుకున్నాననీ, పాత్ర బాగుంటే సపోర్టింగ్ యాక్టర్ రోల్స్ కూడా వేసేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు. వయసకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ తన స్థాయిని కొత్తగా మలచుకున్న బిగ్ బి నాకు స్పూర్తి అన్నారు నాగ్.
అప్పట్లో వర్మ కోరితే బాలీవుడ్ కి వెళ్లడం కుదరదు అన్నారు. ఇప్పుడు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. అంటే, భవిష్యత్తులో బాలీవుడ్ లో కొన్ని విభిన్న పాత్రల్లో నాగ్ కనిపించే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చారనే అనుకోవాలి. నాగ్ - అమితాబ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు ప్రముఖులను మరోసారి తెరమీద చూడాలన్నది ప్రేక్షకుల కోరిక.