50 టైటిళ్ల తర్వాత అది ఫిక్సయింది

Update: 2017-12-17 11:30 GMT
హీరోగా తన తొలి సినిమాకు తన పేరే పెట్టుకున్న అఖిల్.. తన రెండో సినిమాకు ‘హలో’ అనే క్యాచీ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ టైటిల్ పెట్టింది దర్శకుడు విక్రమ్ కుమారే అని అంతా అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదట. స్వయంగా ఈ చిత్ర నిర్మాత.. అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జునే ఈ టైటిల్ సజెస్ట్ చేశాడట. ఈ టైటిల్ కంటే ముంద దాదాపు 50 టైటిళ్లు అనుకున్నామని.. కానీ వాటిలో ఏదీ యాప్ట్ అనిపించలేదని.. ఏదీ ఫైనలైజ్ చేయలేదని.. చివరికి ‘హలో’ అనే మంచి టైటిల్ ఖరారైందని నాగ్ తెలిపాడు. ఈ టైటిల్ ఆలోచన తనకు ఎలా వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో నాగ్ వెల్లడించాడు.

‘‘నాకు ఉదయం వ్యాయామం చేస్తున్నపుడు మంచి మంచి ఐడియాలు వస్తుంటాయి. ‘హలో’ టైటిల్ ఐడియా కూడా అలాగే వచ్చింది. ఒక రోజు ఉదయం జిమ్ లో ఉన్నపుడు మెరుపులాగా ఈ టైటిల్ తట్టింది. వెంటనే మా సుప్రియకు చెప్పి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించమన్నాను. ఐతే విక్రమ్ కుమార్ ఇలాంటి టైటిల్ ఒప్పుకుంటాడన్న నమ్మకమైతే లేదు. కానీ అతడికి ఈ టైటిల్ చెప్పడం ఆలస్యం ఓకే చెప్పాడు. అలా ఈ చిత్రానికి ‘హలో’ టైటిల్ ఖరారైంది’’ అని నాగార్జున వెల్లడించాడు. ‘హలో’లో హీరో హీరోయిన్ తనకు చిన్నతనంలో ఇచ్చిన ఇచ్చిన ఫోన్ నంబరుకు 15 ఏళ్ల పాటు ఫోన్ చేస్తుంటాడు. కానీ ఆమె నుంచి స్పందన ఉండదు. చివరికి ఆమె లైన్లోకి వచ్చి ఇతడికి ‘హలో’ చెప్పడం మీద ఈ కథ నడుస్తుంది. అందుకే దీనికి ఈ టైటిల్ ఖరారు చేసినట్లు నాగ్ ఇంతకుముందే వెల్లడించాడు.
Tags:    

Similar News