మన్మధుడి కోసం ఇద్దరు హీరోయిన్లు

Update: 2019-02-16 16:47 GMT
అక్కినేని నాగార్జున తన లాస్ట్ సినిమా 'దేవదాస్' లో న్యాచురల్ స్టార్ నానితో కలిసి నటించిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా తర్వాత నాగార్జున ఇంకా తన నెక్స్ట్ తెలుగు సినిమాను ప్రకటించలేదు.  అధికారిక ప్రకటన రాలేదు కానీ నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన 'మన్మధుడు' చిత్రానికి సీక్వెల్ లో నటించేందుకు నాగ్ సిద్దమవుతున్నారట.  ఈ సినిమా కోసం 'చిలసౌ' దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక రొమాంటిక్ కామెడీ స్క్రిప్టును రెడీ  చేశాడట.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో ప్రీప్రొడక్షన్ జోరుగా సాగుతోందట.  ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా నటీనటుల ఎంపిక.. టెక్నిషియన్లను ఫైనలైజ్ చేయడం పై ఫోకస్ చేస్తున్నారట.  ఈ సమయంలో హీరోయిన్ల గురించి ఇంట్రస్టింగ్ టాక్ విన్పిస్తోంది. ఈ సినిమాలో 'మన్మధుడు' స్టైల్ లోనే ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.  ఒక హీరోయిన్ గా ఇప్పటికే 'RX100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను ఫైనలైజ్ చేశారట. మరో హీరోయిన్ గా అనుష్కను సంప్రదించారని సమాచారం.  నాగార్జున సినిమా అంటే అనుష్క దాదాపుగా 'నో' చెప్పదు.   నాగార్జున సినిమా 'సూపర్' ద్వారానే అనుష్క టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో అనుష్క నాగ్ కు జోడీగా నటించింది. సో.. మరోసారి తెరపై నాగ్-అనుష్క జోడీ ని చూడొచ్చన్నమాట.

ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 'మన్మధుడు' కూడా అన్నపూర్ణ బ్యానర్ పై తెరకెక్కిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాను 'మన్మధుడు-2' టైటిల్ తో తెరకెక్కిస్తాడని సమాచారం.  
Tags:    

Similar News