నాగ్ ఎందుకంత సాహసం చేశాడంటే..

Update: 2016-03-19 04:15 GMT
అప్పట్లో గీతాంజలి - శివ - అన్నమయ్య లాంటి సినిమాలు తమిళంలోనూ అద్భుత విజయం సాధించాయి. కానీ ఆ సినిమాలు వేటికీ నాగార్జున డబ్బింగ్ చెప్పుకోలేదు. తమిళంలో నేరుగా ‘రక్షకుడు’ అనే సినిమా చేశాడు నాగ్. దానికి కూడా వాయిస్ ఇవ్వలేదు. ‘గగనం’ కూడా ద్విభాషా చిత్రమే. దానికి కూడా డబ్బింగ్ చెప్పలేదు. కానీ ‘ఊపిరి’ తమిళ వెర్షన్‌ కు మాత్రం వాయిస్ ఇచ్చాడు. మరి ఎందుకీ సాహసం చేశాడు అంటే.. అంతా కార్తి వల్లే అంటున్నాడు నాగార్జున.

నిజానికి ‘ఊపిరి’ తమిళ వెర్షన్ ‘తొళ’లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పాలని నాగ్ అస్సలు అనుకోలేదట. దర్శకుడితో పాటు ఎవ్వరికీ కూడా ఆ ఆలోచన లేదట. అక్కడి లోకల్ డబ్బింగ్ ఆర్టిస్టుతో వాయిస్ ఇప్పిద్దామనే అనుకున్నారట. ఆ పని కూడా పూర్తయిందట. ఐతే ఆ వాయిస్ నాగార్జునకు సూటవ్వట్లేదని కార్తి అభ్యంతరం చెప్పాడట. తనతో నాగ్ తమిళం మాట్లాడే తీరు చూసి.. ఆయన డబ్బింగ్ చెబితేనే బాగుంటుందని పట్టుబట్టాడట.

తెలుగు అంతంతమాత్రంగా తెలిసిన తనే ఇక్కడ డబ్బింగ్ చెబుతుంటే.. తమిళం బాగా వచ్చిన మీకేంటని నాగ్‌ ను బలవంతపెట్టి డబ్బింగ్ చెప్పించాడట కార్తి. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా వెల్లడించాడు. తమిళం వచ్చినప్పటికీ.. కరెక్ట్ స్లాంగ్ లో డబ్బింగ్ చెప్పడానికి బాగా ఇబ్బంది పడ్డానని.. ఐతే ఇది తనకు ఓ కొత్త అనుభూతి ఇచ్చిందని నాగ్ చెప్పాడు. ఈ సినిమాకు కార్తి - తమన్నా సైతం రెండు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
Tags:    

Similar News