స్టార్ డైరెక్ట‌ర్‌కు భ‌రోసా ఇచ్చిన నాగ్‌

Update: 2016-02-21 13:20 GMT
సోగ్గాడే చిన్నినాయనా.. సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా నాగ్ కెరీర్‌ లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. 53 కోట్లు వసూలు చేసి నాగ్ కెరీర్‌ లోనే ట్రెండ్ సెట్టర్‌ గా నిలిచింది.శివ అప్పట్లో 10 కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించన‌ప్ప‌టికీ భారీ విజ‌యం సాధించిన‌ట్లే సోగ్గాడే కూడా అదే రేంజ్‌లో స‌త్తాచాటింద‌ని అభిమానులు చెప్తున్నారు. అయితే ఈ క్రెడిట్ అంతా హీరో నాగార్జున ఖాతాలోకే చేరిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్‌ న‌గ‌ర్‌ లో మొద‌లైన ఈ పుకార్లు ఆనోటా ఈనోటా నాగ్ వ‌ద్ద‌కు చేరిపోయాయి. దీంతో నాగ్ ఒకింత అప్‌ సెట్ అయ్యారు.

ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ సోగ్గాడే సినిమా ఈ స్థాయి విజయం సాధించిందంటే ఆ క్రెడిట్ కల్యాణ్‌ కృష్ణదేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సినిమా విజయం కొత్త వాళ్లతో పని చేయాలన్న ధైర్యాన్నిచ్చిందని చెప్పారు. భారీ స్థాయిలో వసూళ్లు రావ‌డం, ప్రేక్ష‌కులంద‌రిలో పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌ని నాగ్ అన్నారు. పండగ ముందు ఎలా ఉందో పండగ తరువాత 35 రోజులు పూర్తయినా అదే స్థాయిలో వసూళ్లు ఉన్నాయని వ‌సూళ్లు త‌న‌కు ముఖ్యం కాదని ఈ సంద‌ర్భంగా తెలిపారు. సోగ్గాడే సినిమాకు సీక్వెల్‌ ని చేయాలనుకుంటున్నామ‌ని ఆ సినిమాకు బంగార్రాజు టైటిల్‌ ని ఖరారు చేశామ‌ని నాగ్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఊపిరి చిత్రంలో నటిస్తున్నానని... ఈ సినిమా తరువాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నానని నాగ్ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News