దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ అనిపించుకోవాల్సి ఉంది. అరంగేట్రంలోనే సోగ్గాడే చిన్ని నాయన వంటి బ్లాక్ బస్టర్ ను అందించి.. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. ఈ ఏడాది వచ్చిన రా రండోయ్ వేడుక చూద్దాం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఈ రెండు సినిమాల సక్సెస్ క్రెడిట్ అంతా నాగార్జున ఖాతాలోకే వెళ్లిపోయింది.
సోగ్గాడే చిత్రానికి ప్రీక్వెల్ గా బంగార్రాజు తీసేందుకు రకరకాల వెర్షన్స్ ను నాగ్ కు వినిపించినా వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు కళ్యాణ్ కృష్ణ. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇవాళే ప్రారంభం కావాల్సి ఉంది. ముహూర్తం షాట్ పిక్చరైజ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఇప్పుడీ మూవీ సినిమా ఆగిపోయిందట. ఇందుకు కారణం నాగార్జున అంటున్నారు సినీ జనాలు. గతంలో కళ్యాణ్ కృష్ణతో చేసుకున్న ఒప్పందాన్ని బేస్ చేసుకుని.. కళ్యాణ్ కృష్ణకు బ్రేక్ వేశారట నాగార్జున.
సోగ్గాడే చిన్ని నాయన మూవీ రిలీజ్ కి ముందే.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వరుసగా మూడు చిత్రాలను తెరకెక్కించేందుకు కళ్యాణ్ కృష్ణ ఒప్పందం చేసుకున్నాడట. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ పూర్తి కాకుండా.. మరో ప్రాజెక్టుపై ఈ దర్శకుడు వర్క్ చేసేందుకు నాగ్ సమ్మతించలేదని తెలుస్తోంది. అటు బంగార్రాజు ప్రారంభం ఎప్పుడో తెలియడం లేదు.. ఇప్పుడు అనుకున్న ప్రాజెక్టు ఆగిపోయింది.. ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ కృష్ణ ఫ్యూచర్ ఏంటో అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి.