కొందరు దర్శకులు కథ రాసుకున్న తర్వాత దాన్ని పట్టుకుని ఇద్దరు ముగ్గురు హీరోల వద్దకు వెళ్తారు. కొందరికి కథ నచ్చుతుంది.. కొందరికి నచ్చదు. నచ్చిన హీరో ఆ కథతో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతాడు. సినిమా విడుదల సమయంలో ఈ కథ ఆ హీరో వద్దకు వెళ్లింది.. ఈ హీరో వద్దకు వెళ్లింది అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు ది ఘోస్ట్ సినిమా కథ విషయంలో దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ది ఘోస్ట్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక కథతో నాగార్జున గారి వద్దకు వెళ్లాను.. ఆ సమయంలో ఆయన ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అంటూ చెప్పారు. అప్పుడు ది ఘోస్ట్ కథను అనుకున్నాను.
పూరిగా నాగార్జున గారిని దృష్టిలో పెట్టుకుని సినిమా కథ రాశాను. ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథను రాయడం వల్ల సన్నివేశాల నుండి మొదలుకుని డైలాగ్స్ వరకు అన్ని కూడా ఆయన ఇమేజ్ కు తగ్గట్లుగా.. ఆయన అభిమానులు మెచ్చుతారా అన్న యాంగిల్ లో ఆలోచిస్తూ రాయాల్సి ఉంటుంది.
ప్రవీణ్ సత్తార్ తాను కథను నాగార్జున గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను ఎలా అయితే అభిమానులు చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపించేందుకు ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చాడు. నాగార్జున గారి కోసం రాసుకున్న కథను మొదట సునీల్ గారికి వినిపించాను. వారు ఓకే చెప్పిన తర్వాత నాగార్జున గారికి వినిపించడం జరిగింది.
నా మనసులో నాగార్జున గారికి ఒక ఇమేజ్ ఉంది.. దానికి తగ్గట్లుగా కథను రాసుకున్నాను అని.. అది ఆయనకు బాగా నచ్చిందని ప్రవీణ్ సత్తార్ చెప్పుకొచ్చాడు. అందుకే ది ఘోస్ట్ సినిమా కథ యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాయిస్ నాగార్జున గారే అన్నట్లుగా ప్రవీణ్ సత్తార్ వ్యాఖ్యలు చేశారు.
దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తారీకున ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమాలో నాగ్ కి జోడీగా సోనాల్ చౌహాన్ నటించింది. ఇంకా సినిమాలో పలువురు ప్రముఖ నటీ నటులు కనిపించబోతున్నారని ట్రైలర్స్ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. దసరా కి ఈ సినిమా విజేతగా నిలిచేందుకు అన్ని లక్షణాలు ఉన్నాయనే అభిప్రాయంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.