మళ్లీ పీఆర్వో రూట్లో నాగ్

Update: 2017-11-08 05:21 GMT
అక్కినేని నాగార్జున ఈ మధ్య తన సొంత సినిమాల కంటే.. తన ఇద్దరు కుమారుల మూవీస్ పై కాన్సంట్రేట్ చేసిన సంగతి తెలిసిందే. కొడుకులు ఇద్దరికీ మాంచి హిట్స్ అందించి.. వారికి కుర్ర హీరోల రేస్ లో అగ్రస్థానానికి తీసుకెళ్లాలని తపన పడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే.. ఆయా సినిమాల పనులను తనే దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఇప్పుడు నాగార్జున.. రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా కోసం తాను ఇప్పుడు 10 రోజులు మాత్రమే పని చేయనున్నట్లుగా చెప్పేశారు నాగ్. ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుంటారట. ఇందుకు కారణం.. అఖిల్ నటించిన రెండో సినిమా హెలో రిలీజ్ కానుండడమే అని స్వయంగా చెప్పారు. ఆ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్.. మార్కెటింగ్ పనులను చూసుకోవాల్సి ఉందని.. ఆ చిత్రానికి తానే నిర్మాత కావడంతో.. మరింత చురుగ్గా ఉంటానని చెప్పారు నాగ్. అంతే కాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తను నటించే సినిమాలపై అంతగా నెర్వస్ కావట్లేదని కూడా అన్నారు నాగార్జున.

రారండోయ్ వేడుక చూద్దాం మూవీ విషయంలో కూడా నాగ్ ఇలాగే అన్నీ తానై వ్యవహరించారు. ప్రమోషన్స్ ను కూడా స్వయంగా దగ్గరుండి హ్యాండిల్ చేయడం చూసి.. పీఆర్వో పనులు కూడా చేసేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. మళ్లీ ఇప్పుడు అఖిల్ కోసం అదే రూట్ లోకి వచ్చేస్తున్నారు నాగ్.
Tags:    

Similar News