ఆఫీసర్.. వేదాంతం చెబుతున్న నాగ్

Update: 2018-06-04 06:04 GMT
ఓ సినిమా చేసిన తర్వాత అది హిట్ అయితే.. ఆ మూవీలో నటించినవారికి పని చేసిన వారికి.. మేకర్స్ కు హుషారు వస్తుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే నిరాశ కలుగుతుంది. మరీ తెగ ఆశలు పెట్టుకున్న సినిమా నిరాశ కలిగిస్తే.. నిస్పృహ కూడా ఆవహిస్తుంది.

కానీ ఓ సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకే.. ఆ మూవీ హీరో వేదాంతం మాట్లాడుతున్నాడంటే దాని అర్ధం ఏంటి? ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా.. ఎవరో కాదు.. ఆఫీసర్ అంటూ గత శుక్రవారం మన ముందుకు వచ్చిన నాగార్జున.. ఇప్పుడు సడెన్ గా వేదాంతంలోకి దిగిపోయారు. రిలీజ్ రోజున పట్టుమని 50 లక్షల షేర్ కూడా రాబట్టలేకపోయిన రాంగోపాల్ వర్మ సినిమా.. రెండో రోజుకే డెఫిషిట్ లోకి వచ్చేసింది. అంటే రెండో రోజుకే ఒక్క రూపాయి షేర్ కూడా ప్రొడ్యూసర్ కు.. పంపిణీ చేసిన వారికి ఇవ్వలేకపోయిందన్న మాట. ఇంతటి దారుణమైన ఫలితాన్ని ఏ స్టార్ హీరో కూడా ఊహించలేడు.

అందుకే నాగ్ ఇప్పుడు వేదాంతంలోకి దిగిపోతూ ఓ ట్వీట్ చేశారు. 'గుడ్ మాణింగ్.. వారం గడిచిపోయి మళ్లీ సోమవారం వచ్చింది. "విజయం అనేదే అంతిమం కాదు.. పరాజయం భయానకం కాదు.. ఏం జరిగినా కొనసాగడమే  మనిషి స్థైరాన్ని చాటుతుంది" అని విన్ స్టన్ చర్చిల్ అన్నారు. అందుకే చిరునవ్వుతో నా ప్రయాణం కొనసాగిస్తాను. హావ్ ఏ గ్రేట్ డే' అంటూ నాగ్ వేదాంతంతో కూడిన ట్వీట్ పెట్టారు.
Tags:    

Similar News