హలో.. దేవుళ్లారా దీవించండి

Update: 2017-12-20 05:13 GMT
అనుకున్న పనిలో విజయం సాధించాలని అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా మానవ ప్రయత్నం చేయాలి. చేయగలిగింది చేశాక తరవాత ఆశించిన ఫలితం రావడానికి దేవుడిపైనే భారం వేస్తాం. తలపెట్టిన పని సక్సెస్ కావాలంటూ భక్తిగా గుడికో.. గోపురానికో వెళ్లి దండం పెట్టొస్తాం. హీరో నాగార్జున ప్రస్తుతం ఇదే పనిలో పడ్డాడు.

తన చిన్న కొడుకు అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేయడంతో అతడిని హీరోగా సక్సెస్ చేసే బాధ్యతను నాగార్జున స్వయంగా తలకెత్తుకున్నాడు. తన ఫ్యామిలీకి మనం లాంటి మరిచిపోలేని చిత్రం అందించిన విక్రమ్ కె.కుమార్ ను డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడు. సినిమా ప్రొడ్యూస్ చేయడంతోపాటు మేకింగ్.. పబ్లిసిటీ.. పోస్టర్ డిజైనింగ్.. టీజర్ ఇలా అన్ని విషయాల్లోనూ నాగ్ దగ్గరుండి చూసుకున్నాడు. నాగ్ ప్రయత్నం ఫలించి అఖిల్ రీ లాంచ్ సినిమా హలో కు పాజిటివ్ బజ్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జాగ్రత్తగా పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేశారు. ఈ తరుణంలో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ భార్య అమలతో కలిసి షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు.

‘‘ఈ రోజు మధ్యాహ్నం నా డియర్ ఫ్రెండ్ మహేష్ రెడ్డితో కలిసి బాబాను దర్శించుకుని ఆయన ఆశీర్వాదం అందుకున్నాం. ఎంతో ప్రశాంతంగా ఉంది. థాంక్యూ బాబా’’ అంటూ నాగ్ తన దైవదర్శనం విశేషాలను ట్విట్టర్ ద్వారా అభిమానులను పంచుకున్నాడు. కొడుకు సినిమాను హిట్ చేసేందుకు ఏ ఒక్క దారి వదిలిపెట్టకుండా నాగ్ చేస్తున్న ప్రయత్నం మెచ్చుకోతగిందే.
Tags:    

Similar News