తండ్రి సినిమా రీమేక్ పై చరణ్ కన్నేశాడా?

Update: 2017-07-25 07:30 GMT
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు.  మ్యాట్నీ ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్ పై కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించనున్నారు.

కొరటాల శివ సినిమాతోపాటు మరో ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ ప్లానింగ్ చేస్తున్నాడు. సినిమా చూపిస్త మావ - నేను లోకల్ సినిమాలతో బంపర్ హిట్లు కొట్టిన దర్శకుడు నక్కిన త్రినాథరావు కలిసి ఈ సినిమా చేసేందుకు అవకాశముంది. ఈ సినిమాకు స్టోరీ ప్లాట్ మెగాస్టార్ చిరంజీవి ఒకనాటి సూపర్ హిట్ మూవీ మంత్రి గారి వియ్యంకుడు నుంచి తీసుకుంటున్నారనేది టాక్. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు తన అసిస్టెంట్లతో కలిసి దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. మంత్రి గారి వియ్యంకుడు ఆ రోజుల్లో యూత్ కు తెగ నచ్చేసింది. ఈ స్టోరీని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కించాలని చూస్తున్నారు.

స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాకే ఈ సినిమాపై నిర్ణయం చెబుతానని రామ్ చరణ్ చెప్పాడు. అన్నీ వర్కవుటయితే ఈ సినిమాకు దిల్ రాజు నిర్మించే అవకాశముంది. అప్పట్లో  మాస్ యూత్ ఫ్యామిలీ ఇలా అన్నివర్గాలకు నచ్చేలా మంత్రిగారి వియ్యంకుడు సినిమా రూపొందింది. కాన్సెప్ట్ పాతదే అయినా సరిగ్గా డీల్ చేస్తే ఈ కాలానికీ నచ్చుతుంది. ఈ విషయంలో నక్కిన త్రినాథరావు ఎంతవరకు ఇంప్రెస్ చేస్తాడో వేచి చూడాలి.
Tags:    

Similar News