రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. కొరటాల శివ డైరెక్షన్ లో చెర్రీ ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పుడే ఆ మరుసటి చిత్రం గురించి మాట్లాడేయడం అంటే మరీ అడ్వాన్స్ అయినట్లు ఉంటుంది కానీ.. స్టోరీ నచ్చితే అన్నీ లాక్ చేసేసుకుని.. ప్రీ ప్రొడక్షన్ పనులు చేపడుతుండడం సహజంగా జరిగేదే.
దర్శకుడు నక్కిన త్రినాథ రావు విషయంలో ఇదే జరిగినట్లు తెలుస్తోంది. సినిమా చూపిస్త మామ అంటూ రాజ్ తరుణ్ తో హిట్ కొట్టిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత నేను లోకల్ అంటూ నానితో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తన రేంజ్ ను సినిమా రేంజ్ ను పెంచుకున్నాడు. ఇప్పుడీ డైరెక్టర్.. రామ్ చరణ్ తో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈయన చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో.. చెర్రీని కలిసే ఏర్పాటు చేశాడట నిర్మాత దిల్ రాజు. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఓ స్టోరీని మెగా పవర్ స్టార్ కి వినిపించాడని తెలుస్తోంది. యాక్షన్ జోనర్ లో ఉండే ఈ లైన్ చెర్రీకి నచ్చడంతో.. స్క్రీన్ ప్లే సిద్ధం చేయమని నక్కిన త్రినాథ రావుకు సూచించినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయడంలో బిజీ అయిపోయాడట డైరెక్టర్. కథ నచ్చింది కాబట్టి.. కథనం కూడా ఓకే అనిపించేసుకుంటే.. రామ్ చరణ్-త్రినాథ రావు కాంబోకి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోతాయని చెప్పచ్చు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టుకు దిల్ రాజు నిర్మాణం వహించనుండడం విశేషం.